పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా ‘ఆదిపురుష్’.రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఓం రౌత్ విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు.
ప్రభాస్ నటిస్తున్న తొలి బాలీవుడ్ సినిమా ‘ఆదిపురుష్‘ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగించేసి గుమ్మడి కాయ కొట్టిన విషయం కూడా తెలిసిందే.
ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో, కృతి సనన్ సీత పాత్రలో, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడి పాత్రలో సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో నటిస్తున్నాడు.
దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడంతో అనుకున్న సమయానికే రిలీజ్ అవుతుంది అని ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ చేస్తున్నారు.
ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు చూడని గ్రాండ్ విజువల్ వండర్ ను ఆదిపురుష్ సినిమా ద్వారా చూపించ బోతున్నాడు ఓం రౌత్.
ఈ సినిమాను 2022 ఆగస్టు 11న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.ఇక్కడి వరకు బాగానే ఉన్నా కూడా ఈ సినిమా విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం నిరాశ గా ఉన్నారు.
ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమా నుండి కనీసం పోస్టర్ అయినా రిలీజ్ అవుతుంది అని అంతా ఎదురు చూసారు.
అయితే వారి ఎదురు చూపులకు నిరాశ ఎదురైంది.ఈ రోజు గ్లిమ్స్ కాదు కదా కనీసం ప్రభాస్ కు సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చెయ్యలేదు.ఓం రౌత్ ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ తో ఉన్న ఒక వీడియోను షేర్ చేస్తూ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపాడు.
దీంతో అందరి అసలు అడియాసలు అయ్యాయి.రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కనీసం పోస్టర్ కూడా రిలీజ్ చెయ్యక పోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.