మరో నాలుగు రోజుల్లో కేజీఎఫ్ ఛాప్టర్2 థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.కేజీఎఫ్ ఛాప్టర్1 ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలై రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది.అయితే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.కేజీఎఫ్2 సినిమా మరో బ్లాక్ బస్టర్ హిట్ అనే విధంగా ఈ రివ్యూ ఉండటం గమనార్హం.బాక్సాఫీస్ వద్ద ఆర్‌ఆర్‌ఆర్ సంచలనాలు సృష్టిస్తున్న సమయంలోనే కేజీఎఫ్2 రిలీజవుతూ ఉండటం గమనార్హం.
ప్రముఖ క్రిటిక్స్ లో ఒకరైన ఉమైర్ సంధు ఈ సినిమాకు రివ్యూ ఇచ్చారు.కేజీఎఫ్2 మూవీ వరల్డ్ క్లాస్ మూవీ అని ఆయన చెప్పుకొచ్చారు.కన్నడ సినిమా రంగానికి ఈ సినిమా కిరీటం లాంటి సినిమా అని ఆయన వెల్లడించారు.
ఈ సినిమాకు 5 రేటింగ్ ఇచ్చిన ఉమైర్ సంధు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీన్ అదిరిపోయిందని పేర్కొన్నారు.సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు సస్పెన్స్ కూడా ఉందని ఆయన అన్నారు.

కేజీఎఫ్2 డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయని డైలాగ్స్ ఎఫెక్టివ్ గా ఉండటంతో పాటు షార్ప్ గా ఉన్నాయని ఉమైర్ సంధు వెల్లడించారు.సినిమాకు మ్యూజిక్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుందని ఆయన వెల్లడించారు.ప్రశాంత్ నీల్ కేజీఎఫ్2 మూవీని అద్భుతంగా తెరకెక్కించారని ఆయన చెప్పుకొచ్చారు.కేజీఎఫ్2 మూవీలో నటించిన ప్రతి ఒక్కరి నటన టెర్రిఫిక్ గా ఉందని ఆయన కామెంట్లు చేశారు.

కేజీఎఫ్2 మూవీ వరల్డ్ క్లాస్ మూవీ అని ఈ సినిమా శాండల్‌వుడ్ బాక్ల్ బస్టర్ మూవీ మాత్రమే కాదని ఉమైర్ సంధు పేర్కొన్నారు.సంజయ్ దత్, యశ్ సినిమాలో బాగా నటించారని ప్రేక్షకులకు షాక్ ఇచ్చే విధంగా ఈ సినిమా క్లైమాక్స్ ఉండబోతుందని ఉమైర్ సంధు పేర్కొన్నారు.కేజీఎఫ్2 సినిమాకు ఉమైర్ సంధు ఇచ్చిన రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.







