వీడియో: దంతాలు క్లీన్ చేస్తున్న రొయ్య.. ఇకపై డెంటిస్ట్‌ల అవసరం లేదా..?

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.తాజాగా అలాంటి ఒక అబ్బురపరిచే వీడియో ట్విట్టర్ లో విపరీతంగా వైరల్ అవుతుంది.

 Shrimp Cleaning Teeth .. No Need For Dentists Anymore Dentists, Viral Latest, Vi-TeluguStop.com

ఈ వీడియోలో ఒక రొయ్య ఒక స్కూబా డైవర్ దంతాలను క్లీన్ చేస్తూ కనిపించింది.అదేంటి అని ఆశ్చర్యపోకండి.

రొయ్య నిజంగానే పంటి మధ్యలో తన కాళ్లు పెట్టి పళ్ళను శుభ్రపరిచింది.ఇది మొదట కింద పళ్ళను తర్వాత పై పళ్లను శుభ్రం చేసింది.

వైరల్ అవుతున్న వీడియోలో మీరు ఒక సముద్రంలో పగడపు దిబ్బల ప్రాంతంలో స్కూబా డైవర్‌ని చూడొచ్చు.ఈ డైవర్ తన నోరు తెరవగా… తన దంతాలు, చిగుళ్ల దగ్గరకు ఓ రొయ్య వచ్చింది.

ఆ తర్వాత ఇది పాదాలతో స్కూబా డైవర్‌ టీత్, గంప్స్ నీట్ గా శుభ్రం చేసింది.అయితే ఇది టీత్ క్లీనింగ్ చేస్తుండగా సదరు వ్యక్తి అలాగే నోరు తెరిచి ఉంచాడు.

ఈ వీడియోలో ఈ చిన్న రొయ్య దాదాపు 50 సెకండ్లపాటు డెంటిస్ట్ లాగా పని చేస్తూ ఆశ్చర్యపరిచింది.

ఈ వీడియోని @AmazingNature00 అనే ట్విట్టర్ ఖాతా షేర్ చేసింది.“పళ్ళు శుభ్రం చెయ్యాలంటే నన్ను సంప్రదించండి” అనే క్యాప్షన్ దీనికి జోడించింది.ఈ వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది.

దీనికి ఇప్పటికే 60 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.అయితే దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఫ్రీ డెంటల్ క్లీనింగ్ చేస్తున్న రొయ్య, ఇది భలే ఉంది అంటూ ఒకరు కామెంట్ చేశారు.ఇకపై డెంటిస్ట్‌లు అవసరం లేదనుకుంటా, సముద్రం లోకి వెళ్తే ఇదే ఉచితంగా అందరికీ దంతాలు క్లీన్ చేసి పెడుతుందేమో అని మరొక యూజర్ కామెంట్ చేశారు.

ఈ వీడియోని మీరు కూడా చూడండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube