ఆ కోటా ఎమ్మెల్సీ స్థానాలపైనే వీరి ఆశలు ! ఎవరికో లక్కీ ఛాన్స్ ?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ లో వివిధ పదవుల భర్తీ విషయమై తీవ్ర పోటీ నెలకొంది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు అంతా పోటీకి దిగారు .

అయితే వారిలో చాలామంది ఓటమి చెందారు.అయినా ఓడిన నేతలు అంతా మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు.

దీనికి కారణం ఎమ్మెల్సీ కోటాలో మంత్రి అయ్యే అవకాశం ఉండటమే.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఎమ్మెల్సీ స్థానాల  భర్తీ చేసే విషయంపై ఫోకస్ పెట్టారు.

దీంతో నాయకుల మధ్య ఈ పదవుల విషయమై తీవ్ర పోటీ నెలకొంది.  ప్రస్తుతం తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

Advertisement

గవర్నర్ కోటాలో రెండు సీట్లు , ఇతర కోటాలో 4 సీట్లు ఖాళీ అయ్యాయి.ఈ ఆరు స్థానాలకు పోటీపడే నేతల జాబితా మాత్రం ఎక్కువగానే ఉంది.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ దక్కని నేతలకు కాంగ్రెస్ అగ్ర నేతలంతా అనేక హామీలు ఇచ్చారు.దీనిలో భాగంగానే ఎమ్మెల్యే సీటు దక్కకపోయినా,  ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చాలామందికి హామీ ఇచ్చారు.

దీంతో వారంతా తమకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కుతుందనే ఆశలు ఉన్నారు.

  ఈ జాబితాలో కొన్ని పేర్లను పరిశీలిస్తే మాజీ మంత్రి చెన్నారెడ్డి , అద్దంకి దయాకర్ తో పాటు,  మరి కొంత మంది ఉన్నారు.రేవంత్ రెడ్డి కోసం కామారెడ్డి సీటును త్యాగం చేసిన సీనియర్ నేత షబ్బీర్ ఆలీ , సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి( Jaggareddy ),  సంపత్ కుమార్, వీరయ్య మధు యాష్కీ , ఫిరోజ్ ఖాన్,  అంజన్ కుమార్ యాదవ్ వంటి వారు ఎమ్మెల్సీ పదవులు విషయంపై  తీవ్రంగా పోటీ పడుతున్నారు.తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో పాటు,  మంత్రివర్గంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కు పోదెం వీరయ్య( Podem Veeraiah ) లేక సైతం రాశారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఇక వీరితో పాటు,  కాంగ్రెస్ కు ఎన్నికల సమయంలో సహకరించిన ఇతర పార్టీల నేతలు ఈసారి ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు.  వీరిలో ముఖ్యంగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం,  సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Advertisement

ఎమ్మెల్సీగా అవకాశం దొరికితే మంత్రిగా అవకాశం దక్కుతుందని వీరంతా ఆశలు పెట్టుకుని కాంగ్రెస్ అధిష్టానం పై ఒత్తిడి చేస్తున్నారు.

 తెలంగాణలో పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ఢిల్లీకి వెళ్ళారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ విషయంపై అధిష్టానం పెద్దలతో చర్చించనున్నారు.  ఈ సందర్భంగా ఒక జాబితాను కూడా వారి ముందు పెట్టబోతున్నట్టు సమాచారం.

తాజా వార్తలు