లీవ్ కావాలని అడిగిన ఉద్యోగి.. ఎంప్లాయర్ ఆ పని చేయాలని అడగడంతో..

ఈ రోజుల్లో యజమానులు ఉద్యోగుల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు.వారిని కొట్టి చాకిరీ చేయించుకుంటున్నారు.

 No Doctors Note No Sick Leave Says Boss Man Quits Job Details, Employee, Quittin-TeluguStop.com

సెలవులు( Leaves ) కూడా ఇవ్వకుండా కఠిన ఆంక్షలు పెడుతున్నారు.తాజాగా ఒక ఉద్యోగి( Employee ) ఆరోగ్యం బాగోలేక సెలవు కావాలని అడిగితే డాక్టర్ సర్టిఫికెట్ చూపితే తప్ప సెలవు ఇచ్చేది లేదన్నట్టు యజమాని మాట్లాడాడు.

సదరు ఉద్యోగి అప్పటికే చాలా సఫర్ అవుతున్నాడు, అంత బాధలో కూడా యజమాని ప్రూఫ్స్ కావాలని అమానుషంగా అడగడం అతడికి అస్సలు నచ్చలేదు అందుకే వెంటనే ఉద్యోగం మానేశాడు.ఈ యజమాని ఉద్యోగికి సంబంధించిన సంభాషణ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రెడిట్‌లో వైరల్ అవుతున్న ఆ రీసెంట్ పోస్ట్ సిక్ లీవ్ విషయంలో ఉద్యోగులు, యజమానుల హక్కులు, బాధ్యతల గురించి తీవ్ర చర్చకు దారితీసింది.‘trustmebrotrust’ అనే రెడిట్‌ యూజర్ పోస్ట్, ఒక ఉద్యోగి, యజమాని మధ్య జరిగిన టెక్స్ట్ కన్వర్జేషన్ స్క్రీన్‌షాట్‌ను చూపింది.ఆ స్క్రీన్‌షాట్‌ ప్రకారం జ్వరం, జలుబుతో బాధపడుతున్నప్పటికీ, డాక్టర్ నోట్ లేకుండా సిక్ లీవ్‌ను( Sick Leave ) బాస్ నిరాకరించాడు, అందుకే ఉద్యోగం మానేసినట్లు ఆ ఉద్యోగి పేర్కొన్నాడు.

Telugu Boss, Job, Doctors, Employee, Quits Job, Reddit, Sick Leave-Latest News -

స్క్రీన్ షాట్ ప్రకారం, ఉద్యోగి ఉదయం తన యజమానికి మెసేజ్ చేశాడు, తాను అనారోగ్యంగా ఉన్నానని, ఆ రోజు పనికి రాలేనని చెప్పాడు.తనకు జ్వరం, జలుబు, బాడీ పెయిన్స్ ఉన్నాయని, కంపెనీలో కొద్ది వారం మాత్రమే పనిచేశానని వివరించాడు.అయితే బాస్ సానుభూతి చూపలేదు, గైర్హాజరీని క్షమించమని డాక్టర్ నోట్‌ను( Doctor Note ) అడిగాడు.

ఉద్యోగి అబద్ధం చెబుతున్నాడని, కేవలం జ్వరం అయితే మాత్రం సెలవు ఎందుకు తీసుకోవాలి? అతను పని చేయవచ్చు కదా అని బాస్ పరోక్షంగా చెప్పాడు.ఉద్యోగి ఆదాయం అతను పని చేసే విధానంపై ఆధారపడి ఉంటుందని, డాక్టర్ కన్సల్టేషన్ ఫీజును కంపెనీ భరించదని ఆయన తెలిపాడు.

Telugu Boss, Job, Doctors, Employee, Quits Job, Reddit, Sick Leave-Latest News -

ఆ ఉద్యోగి స్పందిస్తూ, డాక్టర్ వద్దకు వెళ్లేందుకు తన వద్ద డబ్బులు లేవని, ఆ ఉద్యోగంలో గంటకు 8 డాలర్లు మాత్రమే సంపాదించానని చెప్పాడు.తక్కువ జీతం ఎక్కువ వర్క్ డిమాండ్ ఉందని అసంతృప్తి వ్యక్తం చేశాడు.పోస్ట్‌కి 6,000 కంటే ఎక్కువ అప్‌వోట్‌లు వచ్చాయి.ఇతర రెడిట్‌ యూజర్ల నుంచి వందల కొద్దీ కామెంట్‌లు వచ్చాయి, వారు ఉద్యోగి పట్ల తమ మద్దతును వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube