ఊ అంటావా మామ అంటూ స్టెప్పులు ఇరగదీసిన మధుమిత, శివబాలాజీ.. వీడియో వైరల్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అందమైన ప్రేమ జంటలలో శివ బాలాజీ, మధుమిత జంట కూడా ఒకటి.హీరో హీరోయిన్లు అన్న విషయం మనందరికీ తెలిసిందే.

 Actress Madhumitha Dance With Husband Siva Balaji Video Goes Viral, Madhumitha,-TeluguStop.com

సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన ఈ జంట రీల్ లైఫ్ లో భార్యాభర్తలు గా నటించి రియల్ లైఫ్ లో కూడా భార్యాభర్తలుగా మారారు.వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.

అయితే పెళ్లి జరిగి చాలా ఏళ్లు అవుతున్నా కూడా ఈ జంట ఏ విషయంలో కూడా వార్తలు నిలవలేదు.చాలా తక్కువగా వీరిద్దరి పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటాయి.

వారి ప్రేమ బంధాన్ని వివాహ బంధాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు ఈ జంట.

అంతే కాకుండా టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో మధుమిత, శివ బాలాజీ జంట కూడా ఒకటి.ఈమధ్య కాలంలో పెళ్లయి ఏడాది రెండేళ్లకే విడాకులు తీసుకుంటున్నా జంటలను చూస్తున్నాం.కానీ పెళ్లయి 13 ఏళ్లు అవుతున్న శివ బాలాజీ మధుమిత మధ్యలో ఇంతవరకు ఎటువంటి మనస్పర్ధలు రాకపోగా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

అయితే ఒకానొక దశలో నటుడిగా బిజీ అయిన శివబాలాజీ ఆ తర్వాత బిగ్ బాస్ విన్నర్ గా నిలిచి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.అయితే మొన్నటి వరకు సోషల్ మీడియాలో సినిమాలలో పెద్దగా కనిపించని శివ బాలాజీ ఇటీవలే మొదలైన మిస్టర్ అండ్ మిసెస్ అనే రియాలిటీ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

శివ బాలాజీ సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటాడు.ఈ నేపథ్యంలోనే తనకు తన భార్య మధుమితకు సంబంధించిన ఫోటోలను వీడియోలను పంచుకుంటూ ఉంటాడు.ఇది ఇలా ఉంటే తాజాగా శివ బాలాజీ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోని షేర్ చేశాడు.ఆ వీడియోలో మధుమిత ఊ అంటావా మావ.ఉఊ అంటావా అనే పాటకు భర్తతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసింది.అందులో మధుమిత డ్రెస్సింగ్ స్టైల్ కి ఆమె చేసిన హాట్ ఎక్స్ ప్రెసివ్ డాన్స్ కి ఫిదా అవుతున్నారు నెటిజన్స్.

ఆ వీడియోని బట్టి చూస్తే ఏదో పార్టీలో మధుమిత ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.మధుమితతో పాటు శివ బాలాజీ కూడా స్టెప్పులు వేశాడు.శివ బాలాజీ మధుమిత తో పాటు ఆట సందీప్, అతని భార్య కూడా వీడియోలో డాన్స్ చేస్తూ కనిపించారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube