బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ గురించి వ్యతిరేకంగా పరిచయం అక్కర్లేదు.షారుక్ ఖాన్ బాలీవుడ్ హీరో అయినప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.
బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్,బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోలలో గుర్తింపు తెచ్చుకున్నాడు షారుఖ్ ఖాన్.అంతేకాకుండా ప్రపంచంలో ఉన్న అత్యంత ధనవంతులైన నటుల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్నారు షారుఖ్ ఖాన్.
ఇకపోతే హీరో షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ గురించి మనందరికీ తెలిసిందే.గౌరీ ఖాన్ ముంబైలో ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అన్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే.

ఇంటీరియర్ డిజైనర్‌గా సెలబ్రిటీల ఇళ్లకు మేక్ ఓవర్లు చేసి భారీగా సంపాదిస్తోంది.షారుఖ్ ఖాన్ సినిమాల ద్వారా కోట్లకు కోట్లు సంపాదిస్తుంటే గౌరీ ఖాన్ ఇంటీరియర్ డిజైనర్ గా కూడా భారీగానే సంపాదిస్తోంది.అంతేకాకుండా గౌరీ ఖాన్ ముంబైలోని టాప్ ధనవంతుల్లో ఒకరిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది.ఇది ఇలా ఉంటే షారుఖ్ ఖాన్ దగ్గర మేనేజర్ గా పనిచేస్తున్న పూజా దద్లానీ, తాజాగా షారుక్ భార్య గౌరీ ఖాన్ పై ప్రశంసల వర్షం కురిపించింది.
అసలు విషయంలోకి వెళ్తే.షారుఖ్ ఖాన్ మేనేజర్‌గా 2012 నుంచి పనిచేస్తున్న పూజా దద్లానీకి షారుఖ్ ఫ్యామిలీతో మంచి అనుబంధమే ఉందని చెప్పవచ్చు.మేనేజర్ మాత్రమే కాకుండా మంచి సన్నిహితురాలు కూడా.

కాగా తాజాగా పూజా దద్లానీ కొత్త ఇంటిని గౌరీ ఖాన్ డిజైన్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది.దీంతో ఆమె సంపాదన, నికర విలువ తదితర అంశాలపై కూడా ప్రస్తుతం ఆసక్తి నెలకొంది.పూజా దద్లానీ తన కొత్త ఇంటి గురించి ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
కొత్త ఇంట్లోకి అడుగు పెడుతున్నాను.ఆనందంతో కొత్త కలల వైపు అడుగులు వేస్తున్నాను.
ఈ కొత్త ప్రయాణంలో తన ఇంటిని అందంగా డిజైన్ చేయడానికి గౌరీ ఖాన్‌ను మించిన గొప్పవాళ్లు ఎవరు ఉంటారు.ఇంటిని అందమైన కలల సౌధంగా మార్చేశారు అంటూ ఇన్‌స్టా స్టోరీలో పూజా దద్లానీ ప్రశంసలు కురిపించింది.
అంతేకాకుండా గౌరీ ఖాన్ కలిసి దిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది.







