ఇంటిలో ఎలుకలు పుస్తకాలు మరియు బట్టలను పాడుచేస్తాయి.అలాగే వాటి మూత్రం మరియు మలం ద్వారా అనేక అంటువ్యాధులు వస్తాయి.
ఎలుకలతో విసుగు చెందినప్పుడు వాటిని ఎలా వదిలించుకోవాలో అనే ఆలోచనలో పడతాం.అయితే ఇక్కడ చెప్పుతున్న సులువైన మార్గాల ద్వారా ఎలుకలను వదిలించుకోవచ్చు.
1.పిప్పరమింట్ ఎసెన్షియల్ ఆయిల్
పిప్పరమింట్ ఎసెన్షియల్ ఆయిల్ యొక్క బలమైన వాసన ఎలుకలకు పడదు.కాబట్టి
అవి పిప్పరమింట్ ఎసెన్షియల్ ఆయిల్ ఉన్న ప్రదేశం నుండి పారిపోతాయి.ఎలుకలు
ఇంటిలోకి ప్రవేశించగానే ఈ పద్దతిని ఉపయోగిస్తే ఎలుకలు దూరంగా పోవటానికి
సహాయపడుతుంది.
కావలసినవి
పిప్పరమింట్ నూనె
కాటన్ బాల్స్
పద్దతి
* పిప్పరమింట్ నూనెలో కాటన్ బాల్ ని ముంచాలి
* సాదారణంగా ఎలుకలు తిరిగే ప్రాంతంలో ఈ కాటన్ బాల్స్ ని ఉంచాలి
* ఈ విధంగా చేస్తే ఎలుకలు ఇంటిలోకి రావు.ఇంటిలో ఉన్న ఎలుకలు బయటకు పారిపోతాయి
* అలాగే ఇంటి పెరటిలో పిప్పరమింట్ మొక్కలను పెంచితే ఎలుకలు ఇంటిలోకి రావు.
2.లవంగం ఎసెన్షియల్ ఆయిల్
ఎలుకలు బలమైన లవంగం ఎసెన్షియల్ ఆయిల్ వాసనను భరించలేవు.లవంగం వాసన ఉన్న
చోటు నుండి ఎలుకలు పారిపోతాయి.దీని కోసం లవంగాలు లేదా లవంగాల నూనెను
ఉపయోగించవచ్చు.
కావలసినవి
లవంగం ఎసెన్షియల్ ఆయిల్
కాటన్ బాల్స్
పద్దతి
* లవంగం ఎసెన్షియల్ ఆయిల్ లో కాటన్ బాల్ ని ముంచాలి
* ఈ కాటన్ బాల్స్ ని తలుపుల దగ్గర మరియు ఎలుకలు ఎక్కువగా తిరిగే
ప్రాంతంలో పెట్టాలి
* అలాగే ఒక కాటన్ క్లాత్ లో కొన్ని లవంగాలను వేసి ర్యాప్ చేసి ఎలుకలు
తిరిగే ప్రదేశంలో పెట్టవచ్చు
* ఈ విధంగా చేస్తే ఎలుకలు ఇంటిలోకి రావు.ఇంటిలో ఉన్న ఎలుకలు బయటకు పారిపోతాయి.
3.కలరా ఉండలు
కలరా ఉండల బలమైన వాసన ఎలుకలను తరిమి కొడుతుంది.
కావలసినవి
మూత ఉన్న చిన్న కంటైనర్
కలరా ఉండలు
పద్దతి
* చిన్న కంటైనర్లను తీసుకోని వాటికీ రంద్రాలు చేయాలి
* ఈ చిన్న కంటైనర్లలో రెండు లేదా మూడు కలరా ఉండలను ఉంచాలి
* ఈ చిన్న కంటైనర్లను ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రాంతంలో ఉంచాలి
* ఈ విధంగా చేయుట వలన ఎలుకలు ఇంటిలోకి రావు.ఇంటిలో ఉన్న ఎలుకలు బయటకు పారిపోతాయి.