టీడీపీ లో తెరపైకి కొత్త ముఖాలు..!!!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లో జోరు పెరిగింది వరుసగా లోక్ సభ నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో అధినేత బిజీ బిజీగా ఉన్నారు తాజాగా అమలాపురం లోక్సభ పరిధిలో టిడిపి అభ్యర్థులకు దాదాపు ఖరారు చేశారు.సీఎం చంద్రబాబు అమలాపురం లోక్ సభ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఇప్పటికే ఐదు అసెంబ్లీ స్థానాల్లో నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్లను దాదాపు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది.

 New Faces In Tdp For Mp And Mla Candidates-TeluguStop.com

మరో నాలుగు సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లను పెండింగ్ లో పెట్టి ఉంచారట.

అమలాపురం అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి తీవ్ర ఉత్కంఠ నెలకొంది కొత్తపేట అసెంబ్లీ స్థానానికి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేరు ప్రకటిస్తారని సమాచారం అందుతోంది.ఇదిలా ఉంటే రామచంద్రపురం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, మండపేట నుంచి వేగుళ్ళ జోగేశ్వరరావు, ముమ్మిడివరం నుంచి దాట్ల బుచ్చి బాబు, కొత్తపేట నుంచి బండారు సత్యానందరావు ల పేర్లు డిసైడ్ చేసినట్టుగా సమాచారం అందుతోంది.అయితే రాజోలు నుంచి మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే సూర్యారావు ఖరారు చేశారట.

ఇక మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు హరీష్ మాదూర్ ని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలని చంద్రబాబు యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.అయితే రిటైర్డ్ హైకోర్టు జడ్జి నక్క బాలయోగి తో పాటు, మాజీ ఎంపీ కృష్ణమూర్తి కుమార్తె తో పాటు, మరో ఇద్దరు ఆ స్థానానికి పోటీ పడుతున్నట్లుగా తెలుస్తోంది.ఇదిలా ఉంటే అమలాపురం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆనందరావును గన్నవరం నుంచి పోటీ చేయాల్సిందిగా బాబు సూచించారట.దాంతో గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే నారాయణమూర్తిని ఈసారి తప్పించే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

అమలాపురం గన్నవరం టిక్కెట్ కోసం ఇప్పటికే కారం శివాజీ , నేలపూడి స్టాలిన్, నేతిపూడి స్వర్ణ లతా, శేషారత్నం ల పేర్లు చంద్రబాబు పరిశీలనలో ఉంచారని తెలుస్తోంది.కేవలం ఈ రెండు నియోజకవర్గాల్లో తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాలలో బాబు అభ్యర్థులను డిసైడ్ చేశారని తెలుస్తోంది.ఏపీలో కొన్ని కొన్ని స్థానాలలో కొత్త అభ్యర్ధులని బరిలోకి దించక పొతే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన బాబు అందుకు తగ్గట్టుగా అభ్యర్ధులని ఖరారు చేశారని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube