అమెరికాలోని వర్జీనియాలో రాత్రి సమయంలో పోలీసులు పెట్రోలింగ్ కి వెళ్తున్నారు.అలా వారు విధులని నిర్వర్తిస్తున్న సమయంలో అనుకోకుండా ఒక్క సారిగా ఓ చారల పులి కనిపించింది.
దాంతో ఒక్క సారిగా వారు షాక్ అయ్యారు.పులి ఏమిటి ఈ ప్రాంతంలో ఉండటం ఏమిటి అంటూ టెన్షన్ పడిన పోలీసులు కాస్త తేరుకుని అది నిజమైన పులి కాదని నిర్ధారించుకున్నారు.
అయితే అది నిజమైనది కాదని ,పులి విగ్రహం అని, అది ఏమి చేయలేదని అనుకున్న పోలీసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.అయితే తనని ఎంతగానో భయపెట్టిన పులి బొమ్మ ఫోటోలు తీసి పేస్ బుక్ లో పోస్ట్ చేశాడు.
అంతేకాదు పోలీస్ డిపార్ట్మెంట్ లోని ప్రిన్స్ విలియం కౌంటీ ఈ ఫోటోలని షేర్ చేస్తూ సోషల్ మాధ్యమాలలో ఉంచాడు.మా అధికారులలో ఒకరు నిజమైన పులి అనుకుని షాక్ తిన్నారు, అయితే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇలాంటి నిజమైన పులి గా ఉండే విగ్రహాలు ఏర్పాటు చేసినప్పుడు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.