వైరల్.. వీటిని ఒప్పుకోకపోతే ఇంట్లోకి నో ఎంట్రీ.. పాపం వరుడు !

పెళ్లి అంటేనే ఎన్నో సరదాలు మరెన్నో అనుభూతులతో నిండి ఉంటుంది.బావను ఆటపట్టిస్తూ మరదళ్లు సరదా సరదా గా గడిపేస్తూ ఉంటారు.

 Groom Asked To Sign Life To Do Wedding Contract For His Bride Wedding, Wedding C-TeluguStop.com

పెళ్లి అంటే ఇద్దరినీ ఒక దగ్గర చేయడమే కాదు.రెండు కుటుంబాలను కూడా కలుపుతుంది.

అలాంటి పెళ్ళికి మన దేశంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది.పెళ్లి అంటే ఆ హడావిడే వేరు.

బంధువులతో ఇల్లంతా కళకళ లాడుతూ ఉంటుంది.

తాజాగా ఒక పెళ్ళిలో జరిగిన ఒక సంఘటన చుస్తే మీరు కూడా తెలియ కుండానే నవ్వుతారు.

అంత మంచి సీన్ ఏమయ్యుంటుందా అని ఆలోచిస్తున్నారా.అయితే వినండి.

తాజాగా ఒక పెళ్ళిలో వరుడికి ఒక వింత సంఘటన ఎదురైంది.పెళ్లి కూతురు చెల్లెల్లు వరుడికి ఒక వింత నిబంధనలు పెట్టారు.

అవి ఓకే అంటేనే పెళ్లి కొడుకుని ఇంట్లోకి రాణిస్తామని వారు చెప్పారు.

ఇంతకీ ఆ వింత కండీషన్స్ ఏమిటా అని ఆలోచిస్తున్నారా.

వరుడు పేరు ఆయుష్. వధువు పేరు రాధికా.ఇద్దరు పెళ్లి తర్వాత వధువు ఇంటికి వెళ్లారు.

అయితే అక్కడ పెళ్లి కూతురు చెల్లెల్లు వరుడిని ఇంట్లోకి రానివ్వకుండా అక్కడే ఆపేసారు.ఇంట్లోకి రానివ్వాలంటే వాళ్ళు చెప్పే కండీషన్స్ ఒప్పుకోవాలని వారు కోరారు.మూడు షరతులతో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసి వరుడు ముందు పెట్టారు.

ఆ మూడు కండీషన్స్ వింటే మీకు వెంటనే నవ్వు వస్తుంది.అవేమిటంటే.రాధికా ఎప్పుడు కరెక్టే.ఆమెను సంవత్సరానికి రెండు నుండి మూడు సార్లు విదేశాలకు తీసుకు వెళ్ళాలి.రాధిక ఎప్పుడు ఏది అడిగిన వెంటనే తీసుకు రావాలి.అని మూడు కండీషన్స్ ఉన్నాయి.

ఇవన్నీ ఓకే అయితే కింద సైన్ చేసి లోపలి రావాలని వరుడితో చెప్పారు.అది చూసి వరుడి నవ్వుతూనే సైన్ చేసి లోపలికి కదిలారు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube