ప్రస్తుత కాలంలో కొందరు మద్యపానానికి బానిసలవుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.దీనికితోడు ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ కారణంగా అత్యవసర సదుపాయాల తప్ప మిగిలిన అనవసర సదుపాయాలను ప్రభుత్వం మూసి వేసింది.
దీంతో మందు బాబులు మద్యం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మరికొందరైతే ఏకంగా విచక్షణ కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒకపక్క
కరోనా వైరస్
మరణాల కంటే ఈ మందు బాబులు ఆత్మహత్య లు రోజురోజుకీ దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి.
దీంతో
కేరళ రాష్ట్ర ప్రభుత్వం
ఈ మందు బాబులు ఆత్మహత్యలను అడ్డుకునేందుకు పరిష్కారాన్ని తీసుకొచ్చింది.
ఇందులో భాగంగా ప్రభుత్వం నుంచి లైసెన్సు పొందినటువంటి మద్యం దుకాణాలలో మద్యం అమ్మకాలను ఓపెన్ చేయడానికి ముందుకు వచ్చింది.అయితే ఈ దుకాణాల్లో మందు కొనుగోలు చేయాలంటే ముందుగా సర్టిఫైడ్ వైద్యుల దగ్గర
మద్యం ధ్రువీకరణ పత్రాన్ని
తీసుకురావాల్సి ఉంటుంది.
ఈ ధ్రువ పత్రాన్ని తీసుకొస్తే మద్యం కొనుగోలు చేయడానికి ఒక పాస్ జారీ చేస్తారు.ఈపాస్ ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మద్యం అందిస్తారు.దీంతో మందుబాబులు గుడ్డికన్నా మెల్ల మేలు అన్నట్టు సర్దుకుపోతున్నారు.దీంతో మరికొందరు మాత్రం వెంటనే మద్యం ధ్రువీకరణ పత్రాలను రెడీ చేసుకునే పనిలో పడ్డారు.
అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి గాను
ప్రజా సంఘాలు
మరియు ప్రముఖ వైద్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను గూర్చి ఆలోచించకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని అంటున్నారు కొందరు వైద్యులు.
అయితే ప్రభుత్వ అధికారులు మాత్రం నిత్యం మద్యం సేవిస్తూ మద్యపానానికి బానిసలవుతున్నారు వంటి వారి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.అయితే మరి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ఎలా చూడాలి.