ఆ దేశ అంతర్యుద్ధానికి ప్రపంచమే బలవుతుందా?

రాజులనాటి కాలానికి వెళితే ఒక రాజు రాజకీయ కాంక్షతో, పక్క రాజ్యంమీద కన్నేస్తే ప్రత్యక్షంగా కత్తి దూసి యుద్ధం చేయాల్సి వచ్చేది.దాంతో రణరంగంలో తీవ్రస్థాయిలో రక్తపాతం జరిగేది.

 Will The World Be Strong For That Country's Civil War , America, China, Corona ,-TeluguStop.com

‌ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేవారు.అప్పటి యుద్ధం ఒక రకం అయితే, నేటి స్మార్ట్ యుగంలో రక్తపాతం లేకుండానే మనిషిని చంపేసే బయోవార్( Biowar ) లాంటి యుద్ధాలగురించి మనం ఈ మధ్యన విన్నాం, దాని ఫలితం కూడా అనుభవించాం.

సాధారణంగా యుద్ధం అనేది ఇద్దరు నాయకులు మధ్య ఉన్న సంఘర్షణ వలన పుడుతుంది.అయితే నేటి యుద్ధాలు ఎలాంటి ఆయుధాలు వాడకుండానే యుద్ధం చేస్తాయి.

దానినే మనం ఇపుడు బయోవార్ అని పిలుస్తున్నాం.

ఇక కోవిడ్ 19 అనేది దానిలో భాగమే అని కొంతమంది రాజకీయ పండితులు చెబుతున్నమాట.అమెరికా చైనాలు( America ,China ) ప్లాన్ ప్రకారమే కరోనా వైరస్ ని ల్యాబ్ లో తయారు చేసి లీక్ చేశారనే ఆరోపణలు వున్నాయి.ఇక కోవిడ్ వలన ప్రపంచ జనులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

ప్రజలు ఇంటిలోనుండి బయటకు కాలుపెట్టలేని పరిస్థితి ఏర్పడింది.భార్యాభర్తలు కూడా ఒకరు పక్కన ఒకరు ఉండలేక, కొంతమంది చేయడానికి పని లేక, తినడానికి కూడా సంపాదన లేక ఈ వైరస్ బారిన బడి అనేక మంది ఈ మట్టిలో కలిసిపోయారు.

ఇప్పటివరకు జరిగిన ప్రపంచ యుద్ధాలలో ఎంతమంది చనిపోయారో, ఎంత నష్టం జరిగిందో ఓ లెక్క ఉందిగానీ, అంతకు మించిన నష్టాన్ని రక్తపాతం లేకుండా రుచి చూపించిన వైరస్ కరోనా వైరస్ అని చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు.అయితే ఇప్పుడు ఈ తతంగం అంతా ఎందుకంటే సుడాన్ ( Sudan )లో పరిపాలన అధికారం కోసం సైనిక చీఫ్ కి, పారా మిలటరీ చీఫ్ కి మధ్య జరుగుతున్న దాడుల్లో అక్కడ ఉన్నటువంటి బయో లేబరేటరీ ధ్వంసం కాగా ఆ బయోలాబ్ లో ఎటువంటి భయానక వైరస్ పురుడు పోసుకుంటుందో, అని ప్రపంచ ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube