చంద్రబాబు( Chandrababu Naidu ) ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తున్నారు.రాబోయే ఎన్నికల్లో టిడిపిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు.
అధికార పార్టీ వైసిపి ప్రభావాన్ని తగ్గించి ప్రజల్లో టిడిపి ప్రభావం పెరిగేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు.దీనిలో భాగంగానే ఆయన జిల్లాలు, నియోజకవర్గాల వారీగా భారీగా పర్యటనలు చేపడుతూనే, టిడిపి పట్టు పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

టిడిపిని మళ్లీ అధికారంలోకి రాకుండా చేసేందుకు వైసిపి అనేక వ్యూహాలు పన్నుతుండడం, ముఖ్యంగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో పరిస్థితిలను తమకు అనుకూలంగా మార్చుకుని, అక్కడ చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా పెట్టుకోవడం, అలాగే మంగళగిరి నియోజకవర్గం లోకేష్ ను టార్గెట్ చేసుకోవడం వంటి వ్యవహారాలు చేపడుతూ ఉండడం తో దానికి కౌంటర్ గా చంద్రబాబు వైసీపీకి పట్టిన ప్రాంతాలు, నియోజకవర్గాలు, జిల్లాల్లో ఎక్కువగా పర్యటనలు ఏర్పాటు చేసుకుంటున్నారు.

అక్కడ తరచుగా పర్యటిస్తూ ఆయా నియోజకవర్గాల్లో టిడిపికి( TDP ) ఆదరణ పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ముఖ్యంగా రాయలసీమతో పాటు , ఉత్తరాంధ్ర జిల్లాలను ఎక్కువగా టార్గెట్ చేసుకున్నారు.కోస్తా జిల్లాల్లో ఎలాగూ జనసేన ప్రభావం ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో టిడిపి, జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉండడంతో బాబు ఎక్కువగా ఉత్తరాంధ్ర , రాయలసీమ జిల్లాలను టార్గెట్ చేసుకుని , ఆయా జిల్లాలోని వైసిపి బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పర్యటనలు, రోడ్డు షోలు నిర్వహిస్తూ, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఇప్పటికే ప్రకాశం, గుంటూరు కృష్ణా జిల్లాలో బాబు పర్యటించారు.

ఈనెల 10వ తేదీ నుంచి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో( Srikakulam ) పర్యటించనున్నారు.పాతపట్నం నియోజకవర్గంలో రోడ్డు షో నిర్వహించడంతో పాటు , భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు.అలాగే విజయనగరం జిల్లాలోని పార్వతీపురం నియోజకవర్గం లోనూ, ఈనెల 17 నుంచి విశాఖ జిల్లాలోని బాబు పర్యటించనున్నారు.







