హీరోగా, సపోర్టింగ్ యాక్టర్ గా ఇండస్ట్రీలో వెంకట్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారనే సంగతి తెలిసిందే.తాజాగా ఒక టాక్ షోకు హాజరైన వెంకట్ తాను విజయవాడలో పుట్టినా ముంబైలో పెరిగానని గత 20 సంవత్సరాలుగా హైదరాబాద్ లో ఉంటున్నానని తెలిపారు.
తన సోదరి ప్రస్తుతం ఐర్లాండ్ లో ఉంటున్నారని వెంకట్ వెల్లడించారు.తన తొలి సినిమా అయిన సీతారాముల కళ్యాణం చూతము రారండి సక్సెస్ అయినా అన్నయ్య సినిమాతోనే గుర్తింపు వచ్చిందని వెంకట్ చెప్పుకొచ్చారు.
తనకు చదువుపై ధ్యాస ఉండేది కాదని బీకాం వరకు చదివానని వెంకట్ అన్నారు.వైవీఎస్ చౌదరి సినిమా కోసం స్క్రీన్ టెస్ట్ కు హాజరు కాగా నాగార్జున తనను హీరోగా ఎంపిక చేశారని బాత్ రూమ్ లో తొలి షాట్ తీశారని వెంకట్ తెలిపారు.
ఏఎన్నార్ నుంచి చాలా విషయాలను గమనించానని ఆయనకు పని పైనే ధ్యాస ఉంటుందని వెంకట్ వెల్లడించారు.విజయశాంతి గారు తనకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని వెంకట్ చెప్పుకొచ్చారు.
చిన్నప్పటి నుంచే తనకు బాలకృష్ణ గారితో పరిచయం ఉందని వెంకట్ అన్నారు.
భలేవాడివి బాసూ సినిమాలో తాను, బాలయ్య కలిసి నటించామని వెంకట్ అన్నారు.తలకోన అడవులలో వేసవి కాలంలో ఈ సినిమా షూటింగ్ జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు.బాలయ్య 67 కిలోల బరువు ఉన్న తనను ఎత్తుకుని పరుగెత్తారని బాలయ్య ఎనర్జీ లెవెల్స్ వేరే లెవెల్ లో ఉంటాయని వెంకట్ కామెంట్లు చేశారు.
తాను పరీక్షల సమయంలో తప్ప మిగతా సమయంలో కాలేజ్ కు వెళ్లలేదని వెంకట్ పేర్కొన్నారు.2014 సంవత్సరంలో ఆ ఐదుగురు షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో యాక్సిడెంట్ అయిందని వెంకట్ చెప్పుకొచ్చారు.తాను 15 నుంచి 20 సినిమాలు చేశానని ఆ సినిమాలలో నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయని వెంకట్ పేర్కొన్నారు.