నందమూరి బాలకృష్ణ అఖండకు ముందు వరుసగా ప్లాప్ లను చవి చూశాడు.ఇక బాలయ్య కెరీర్ గాడి లో పడుతుందా అనుకుంటూ ఉండగా అఖండ సూపర్ హిట్ అవ్వడం.
వెంటనే గోపీచంద్ మలినేని ఒక సినిమాను చేయడం.ఆ సినిమాకు మంచి బజ్ ఉంది.
త్వరలో విడుదల తేదీని ప్రకటించ బోతున్నారు.గోపీచంద్ మలినేని సినిమా తర్వాత బాలయ్య మోస్ట్ వెయిటింగ్ మూవీ అనీల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నాడు.
ఆ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.ఒక వైపు ఈ రెండు సినిమాలు లైన్ లో ఉండగానే మరో వైపు కొత్త దర్శకులకు ప్లాప్ దర్శకులకు బాలయ్య అవకాశం ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా ఒక ప్లాప్ డైరెక్టర్ కు బాలయ్య డేట్లు ఇచ్చాడు అంటూ వస్తున్న వార్తలు అభిమానులకు ఆందోళన కలిగిస్తున్నాయి.
గతం లో రైటర్ గా చేసిన ఆయన దర్శకుడి గా ఎంట్రీ ఇచ్చాడు.
దర్శకుడి గా ఎంట్రీ ఇచ్చి సుదీర్ఘ కాలం పాటు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.కాని ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా ఆయన సక్సెస్ చేసుకోలేక పోయాడు.
అయినా కూడా కెరీర్ లో ఏదో విధంగా నెట్టుకు వస్తున్నాడు.ఇప్పుడు ఆ దర్శకుడికి బాలయ్య డేట్లు ఇచ్చాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
ఇది ఖచ్చితం గా అత్యుత్సాహం అంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సన్నిహితుడు అయితే అయ్యి ఉండవచ్చు.
కాని ప్లాప్ డైరెక్టర్ కు సినిమా చేసే అవకాశం ఇవ్వడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.గతం లో వరుసగా సినిమా లు చేసి ఆవేశంతో హడావుడి చేసిన బాలయ్య ప్లాప్ అయ్యాడు.
ఇప్పుడు మళ్లీ అదే తరహా లో హడావుడి చేస్తున్నాడు అంటూ విమర్శలు వస్తున్నాయి.