విజయవాడలోని కృష్ణానదిలో తెప్పోత్సవంకు సర్వం సిద్ధం అయింది.ఈ మేరకు సాయంత్రం హంస వాహనంపై శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులు విహరించనున్నారు.
దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల తెప్పోత్సవం కీలక ఘట్టమన్న సంగతి తెలిసిందే.ఈ తెప్పోత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
దుర్గగుడి ఇంజనీరింగ్ అధికారులు, ఇరిగేషన్, రెవెన్యూ మరియు పోలీస్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో తెప్పోత్సవాన్ని విజయవంతం చేసుందుకు గానూ సర్వం సిద్ధం చేశారు.అయితే కరోనా, వరదల కారణంగా మూడేళ్లుగా తెప్పోత్సవం నిర్వహించలేదు.