లోకేష్( Lokesh Kanagaraj ) సినిమాటిక్ యూనివర్స్ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం లియో( Leo ) .డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో ఎంతో ప్రతిషాత్మకంగా తెరకెక్కి అక్టోబర్ 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా మిశ్రమ స్పందన లభించుకుంది.
విక్రమ్, ఖైదీ, మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకేకిచ్చిన డైరెక్టర్ లోకేష్( Lokesh Kanagaraj ) ఈ సినిమాకు డైరెక్టర్గా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.ఈ క్రమంలోనే భారీ స్థాయిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుపుకుంది.

ఈ సినిమా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల ప్రీ ప్లీజ్ బిజినెస్ జరుపుకుందని తెలుస్తోంది.ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ మిశ్రమ స్పందన లభించుకోవడం, పలుచోట్ల నెగిటివ్ టాక్ కూడా సొంతం చేసుకుంది.అయినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం భారీగానే వసూలు రాబడుతుందని తెలుస్తుంది.ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీ స్థాయిలో జరిగాయి.
ఇక దసరా పండుగ నేపథ్యంలో భారీగానే ప్రేక్షకులు థియేటర్లకు రావడంతో కలెక్షన్ల పరంగా ఈ సినిమా కూడా సేఫ్ అవుతుందని తెలుస్తుంది మరో రెండు రోజులలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని సమాచారం.

ఇక ఈ సినిమా ఏకంగా 400 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది అంటే ఈ సినిమా కోసం పని చేసినటువంటి సెలెబ్రెటీలకు ఏ స్థాయిలో రెమ్యూనరేషన్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.ఇక ఈ సినిమాకు డైరెక్టర్ లోకేష్( Lokesh Kanagaraj ) దర్శకత్వం వహించడంతో ఈయనకు ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చారనే విషయం గురించి కూడా ఒక వార్త వైరల్ గా మారింది. డైరెక్టర్ లోకేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించినందుకు గాను ఏకంగా 50 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్( Remuneration ) అందించారని తెలుస్తుంది.
ఈయన ఇండస్ట్రీలోకి వచ్చి చేసినది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.