ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు నేడు నోటిఫికేషన్ రానుంది.ఈ నెల 24వ తేదీ నుంచి దీనికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.30వ తేదీన నామినేషన్ల దాఖలుకు గడువు ముగుస్తుంది.అక్టోబర్ 17న నూతన అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.
అయితే, ప్రస్తుతం సోనియా గాంధీ ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే.
అధ్యక్ష పదవిని స్వీకరించడానికి రాహుల్ గాంధీ ఇష్టపడకపోవడంతో.
గాంధీయేతర కుటుంబానికి చెందిన నాయకుడు ఎన్నిక అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.మరోవైపు కొందరు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీనే అధ్యక్షునిగా ఎన్నిక కావాలని భావిస్తున్నారు.
ఇటు తెలంగాణలో పీసీసీ చీఫ్ నేతృత్వంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించిన నేతలు పార్టీ చీఫ్ గా రాహుల్ గాంధీనే ఏకగ్రీవంగా తీర్మానించారు.