తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు చర్చ అంతా రేవంత్ రెడ్డి పైనే జరుగుతోంది.పీసీసీ ప్రెసిడెంట్ గా నియమించబడ్డ తరువాత కాంగ్రెస్ లోని అందరి సీనియర్ లను తానే స్వయంగా వెళ్లి కలవడం, కాంగ్రెస్ అంటే వర్గ విభేదాలు అనేంతలా ప్రజల్లో ఒక ప్రచారం ఉన్న తరుణంలో ఒక్కడిగా పోరాడితే చాలా కష్టం, అనుకున్న ఫలితాలు రావని భావించిన రేవంత్ రెడ్డి ఇక అంతర్గత విభేదాలకు చెక్ పెట్టాలని ముందుగా నిర్ణయించుకున్న వ్యూహంలో భాగంగానే సీనియర్ నాయకులని కలుస్తున్నట్టు సమాచారం.
అయితే మరి రేవంత్ వాళ్ళతో కలిసిన సందర్బంలో తన వ్యూహాన్ని నేతలకు వివరించిన పరిస్థితి ఉంది.అయితే రేవంత్ కు సీనియర్ ల మద్దతు దొరికితే రేవంత్ కు పెద్ద బలం దొరికినట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఒకవేళ రేవంత్ తో కలిసి పోరాడితే కెసీఆర్ కు కొంత సంకట పరిస్థితులు ఎదురవుతాయని చెప్పవచ్చు.ఎందుకంటే ఇప్పుడు ఒక్క బీజేపీ బలపడితేనే కెసీఆర్ కు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పెద్ద షాక్ తగిలింది.ఇదే పరిస్థితి రాష్ట్రమంతా జరిగితే కెసీఆర్ కు చాలా గట్టిగా పోరాడాల్సిన సమయం అసన్నమైందని అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది.అయితే కెసీఆర్ ఇప్పుడు నలువైపులా ప్రగతిపై దృష్టి పెట్టాడు కాబట్టి ఎలా భవిష్యత్తు రాజకీయం ఉంటుందనేది చూడాల్సి ఉంది.