సాధారణంగా లవర్స్ అంటే ఎలా ఉంటారు.ఒకరికొకరు ప్రేమ పంచుకుంటూ జాలీగా గడిపేస్తుంటారు.
గిఫ్టులు ఇచ్చిపుచ్చుకుంటారు.సినిమాలు షికారులకు వెళ్తుంటారు.
సరదాగా ఉంటూ ఎవరి పనులు వారు చేసుకుంటారు.కొంతమంది కాలేజీలో ప్రేమలో పడి చదువుతో పాటు లవ్ ని కంటిన్యూ చేస్తారు.
అవసరాలకు డబ్బుల కోసం పేరెంట్స్ ని ఫ్రెండ్స్ ని అడిగి తీసుకుంటారు.అయితే కొందరు మాత్రం చెడు దారులను ఎంచుకుంటున్నారు.
విలాసాలకు, జల్సాలకు డబ్బులు సరిపోకపోవడతో అడ్డదారులు తొక్కుతున్నారు.కాగా ఓ లవర్స్ జంట డబ్బుల కోసం ఏం చేశారో చూద్దాం.
ఇద్దరూ ఒకే కాలేజీలో ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు.మూడెళ్లుగా గాఢంగా ప్రేమించుకుంటున్నారు.విలాసవంతంగా తెగ ఎంజాయ్ చేస్తున్నారు.దీంతో ఉన్న డబ్బులు అయిపోయాలి.
ఎంచేయాలో అర్థం కాలేదు.దీంతో ఓ ప్లాన్ వేశారు.
అదే చైన్ స్నాచింగ్ పక్కప్లాన్ వేసి చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్నారు. ప్రియు రాలు బైక్ నడుపుతుంటై ప్రియుడు ఎంచక్కా చైన్లు లాగుతుంటాడు.
ఇలా ఒకరోజు మేకలు మేపుతున్న తొండముత్తూర్ ప్రాంతానికి చెందిన కాలియమ్మాళ్ అనే మహిళను అడ్రస్ అడుగుతున్నట్లు నటించి మాట్లలో పెట్టి చైన్ లాక్కుని పారిపోయారు.దీంతో సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ టీవీల ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు.
తమిళనాడులోని కోయంబత్తూర్ పోలీసులు ఈ కన్నింగ్ లవర్స్ ఆటలకు చెక్ పెట్టారు.

నిందితులు ప్రసాద్, తేజస్వీని పేరూర్ పచ్చపాళ్యంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు.కాగా ఆన్లైన్ బెట్టింగ్ తో ప్రసాద్ డబ్బులు పోగొట్టుకోవడంతో అప్పలు తీర్చేందుకు ఈ పనులు చేస్తున్నట్లు వెల్లడైంది.విషయం ఏమిటంటే నిందితుడు ప్రసాద్ సొంత ఇంట్లో కూడా బంగారం దొంగిలించాడు.
ఇదితెలియక కేసు పెట్టిన తండ్రి చేసేదేమిలేక కేసు వాపస్ తీసుకున్నాడు.నిందితులిద్దరిని జ్యుడిషియల్ కస్టడికి పంపినట్లు పోలీసులు తెలిపారు.