తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న డైరెక్టర్లలో సందీప్ రెడ్డి( Sandeep Reddy Vanga ) ఒకరు.ఈయన చేసిన మొదటి సినిమా అయిన అర్జున్ రెడ్డి సినిమా చేయడానికి ప్రొడ్యూసర్ గా ఏ ఒక్క ప్రొడ్యూసర్ కూడా ముందుకు రాలేదు.
ఇక దాంతో వాళ్ళ అన్నయ్య ప్రణయ్ రెడ్డిని ప్రొడ్యూసర్ గా పరిచయం చేస్తూ రెండున్నర కోట్లు పెట్టి తీసిన అర్జున్ రెడ్డి సినిమా 50 కోట్ల వసూళ్లను కలెక్ట్ చేసింది.
ఇక ఇప్పుడు ప్రణయ్ రెడ్డి పాన్ ఇండియా లెవల్లో వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు.ఇక ఇప్పుడు వచ్చిన అనిమల్ సినిమాతో ( Animal Movie )మరోసారి పాన్ ఇండియా లెవల్లో డైరెక్షన్ పరం గా సందీప్ వంగ అలాగే వాళ్ల అన్నయ్య అయిన ప్రణయ్ రెడ్డి ఇద్దరు కూడా వాళ్ల సత్తా చాటుకున్నారు.ఇక ఇప్పుడు భద్రకాళి ప్రొడక్షన్ హౌజ్ పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అయింది.
ఇక ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో చేసే స్పిరిట్ సినిమాకి కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా ప్రణయ్ రెడ్డి వ్యవహరించబోతున్నాడు అనే విషయం అయితే తెలుస్తుంది.
ఇక ఇదే క్రమంలో అనిమల్ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ప్రణయ్ రెడ్డి( Pranay Reddy ) దాదాపు 300 కోట్ల వరకు సంపాదించినట్టుగా తెలుస్తుంది.దెబ్బకి అటు సందీప్ పాన్ ఇండియా డైరెక్టర్ గా కొనసాగగా వాళ్ళ అన్నయ్య ప్రొడ్యూసర్ గా మారిపోయాడు.ఇక దీంతో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వచ్చే ప్రతి సినిమాకి కూడా వాళ్ళ బ్యానర్ నుంచి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా కొనసాగిబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది…ఇక మొత్తానికి సందీప్ రెడ్డి అలానే వాళ్ల అన్నయ్య ప్రణయ్ రెడ్డి ఇద్దరు కూడా ఇండస్ట్రీలో డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా సెటిలైపోయారు…
.