టాలీవుడ్ బ్యూటీ, హీరోయిన్ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రాశి ఖన్నా మొదట ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత వరుస సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకోవడంతో పాటు తెలుగు సినీ ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకుంది.ఇకపోతే రాశీ ఖన్నా కెరిర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూనే ఉంటుంది.
అలా హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే రాశి ఖన్నా దక్షిణ సినీ పరిశ్రమపై షాకింగ్ కామెంట్స్ చేసింది అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఆమె శరీర తత్వాన్ని అవహేళన చేశారని, అంతేకాకుండా టాలెంట్ కి తగ్గ సినిమాలు దక్షిణాది సినీ పరిశ్రమలో లేవు అని రాశి ఖన్నా చెప్పినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.ఇదే విషయంపై తాజాగా రాశిఖన్నా స్పందించింది.
వెంటనే తనపై వస్తున్న అసత్య ప్రచారాలు ఖండిస్తూ సౌత్ సినీ ఇండస్ట్రీ నేను దూషించాను అంటూ అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి.
భాష ఏదైనా సరే నేను పనిచేసే సినీ పరిశ్రమపై, సినిమాలపై నాకు ఎంతో గౌరవం ఉంది దయచేసి నాపై అసత్య ప్రచారాలు ఆపండి అని తెలిపింది రాశి ఖన్నా.ఇకపోతే రాశి ఖన్నా తన ఫిట్నెస్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే.రోజురోజుకీ తన గ్లామర్ డోస్ ని పెంచుకుంటూ పోతోంది ఈ ముద్దుగుమ్మ.
ఇకపోతే ప్రస్తుతం తెలుగు,తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.ఈ క్రమంలోనే రాశి ఖన్నా ఇటీవలె అజయ్ దేవగణ్ సరసన రుద్ర అనే ఒక వెబ్ సిరీస్ లో నటించింది.
అలాగే రాశి ఖన్నా నటించిన సర్దార్,పక్కా కమర్షియల్, థాంక్యూ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.