ఏపీలో తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలో పర్యటిస్తారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.పర్యటనలో భాగంగా విజయనగరం లేదా విశాఖలో బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం.
ఏపీలో కేసీఆర్ పర్యటన తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.ఏపీలో బిఆర్ఎస్ సభపై రాజకీయ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి.
కెసిఆర్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు.అక్కడే బిఆర్ఎస్ కార్యాలయ నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
జాతీయ పార్టీ ప్రకటన తర్వాత మొదటిసారి ఢిల్లీ వెళ్ళిన ఆయన త్వరలో ఏపీలో పర్యటిస్తారు అనే వార్తలు వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.