వైసీపీ మంత్రి, నటి రోజా మంత్రి హోదా దక్కిన తర్వాత ప్రతిపక్షాలపై విమర్శలు చేసే విషయంలో దూకుడు పెంచిన సంగతి తెలిసిందే.ఈరోజు తిరుపతిలో జగనన్న విద్యాదీవెన స్కీమ్ అమలు కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ తాను చదువుకునే సమయంలో జగన్ లాంటి సీఎం లేరని వెల్లడించారు.
ఆ సమయంలో జగన్ లాంటి సీఎం లేకపోయినా తనకు జగన్ కేబినేట్ లో పని చేసే ఛాన్స్ అయితే దక్కిందని రోజా చెప్పుకొచ్చారు.
ఏపీ సీఎం జగన్ కు వస్తున్న ప్రశంసలు చంద్రబాబుకు సహించడం లేదని రోజా కామెంట్లు చేశారు.
కరువుకు ప్యాంట్, షర్ట్ వేస్తే చంద్రబాబు నాయుడు అవుతారంటూ రోజా వ్యంగ్యాస్త్రాలు సంధించడం గమనార్హం.పేద ప్రజలకు సీఎం జగన్ పెద్ద దిక్కుగా ఉన్నారని రోజా కామెంట్లు చేశారు.
కులమతాలకు అతీతంగా, వయస్సుతో సంబంధం లేకుండా సీఎం జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని రోజా కామెంట్లు చేయడం గమనార్హం.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదువుకునే విధంగా సీఎం జగన్ చేశారని జగన్ కు పాదాభివందనాలు చెబుతున్నానని రోజా వెల్లడించారు.

2024 సంవత్సరంలో టీడీపీకి 23 సీట్లు కూడా దక్కవని రోజా కామెంట్లు చేశారు.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వర్షాలు పడ్డాయా అంటూ రోజా ప్రశ్నించారు.చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందలేదని రోజా కామెంట్లు చేశారు.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు డ్వాక్రా అక్కా చెల్లెమ్మలకు అసలు, వడ్డీ రాలేదని పేదలకు ఇళ్ల పట్టాలు రాలేదని రోజా చెప్పుకొచ్చారు.బాదుడే బాదుడని చెబుతూ తెలుగుదేశం కార్యక్రమాలు చేస్తుందని ఇలా చేస్తే 2024 సంవత్సరంలో టీడీపీకి 23 సీట్లు కూడా రావని రోజా అన్నారు.వైసీపీ నేతలలో ఉత్సాహం నింపేలా రోజా కామెంట్లు చేశారు.







