హెచ్‌ఆర్‌ విభాగంలో ఉద్యోగం ఎలా సంపాదించాలి? అర్హతలివే..

మానవ వనరుల విభాగంలో ఉద్యోగం చాలా ఆసక్తికరంగా ఆకర్షణీయంగా ఉంటుంది.ఈ ఉద్యోగం కోసం మీరు సాంకేతికంగా నైపుణ్యం కలిగి ఉండాలి.

 How To Make A Career In Hr , Human Resources , Job, Bachelors Of Business Admini-TeluguStop.com

కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సహోద్యోగులతో సంభాషించడానికి, సంబంధాలను ఏర్పరచుకోవడానికి అనువైన మానవ నైపుణ్యాలను కలిగి ఉండాలి.మానవ వనరుల రంగంలో ఉండేవారు ఇతరులతో కనెక్ట్ అవడంతోపాటు వారి సమస్యలను పరిష్కరించగలగాలి.12వ తరగతి తర్వాత హ్యూమన్ రిసోర్సెస్ (హెచ్‌ఆర్)లో కెరీర్ ఎంపిక చేసుకోవచ్చు.గ్రాడ్యుయేషన్‌లో బిబిఎ (బ్యాచిలర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) లేదా ఎంబిఎ కోర్సును అభ్యసించవచ్చు లేదా ఏదైనా రంగం నుండి గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంబిఎ కోర్సును హ్యూమన్ రిసోర్సెస్ (హెచ్‌ఆర్)లో స్పెషలైజేషన్ చేయవచ్చు.

ఈ కోర్సులు.ఒక కంపెనీ లేదా సంస్థ ఎలా పనిచేస్తుందనే దాని గురించి సరైన జ్ఞానాన్ని విద్యర్థికి అందిస్తాయి.అయితే మీరు హ్యూమన్ రిసోర్సెస్ (హెచ్ఆర్)కి సంబంధం లేని ఫీల్డ్ నుండి గ్రాడ్యుయేషన్ చేస్తే సర్టిఫికేషన్ కోర్సులు లేదా మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా కోర్సులను చేయవచ్చు.

ఎందుకంటే ఈ కోర్సులు అన్ని చోట్లా అత్యంత గుర్తింపు ఉంటుంది.

నేటి ప్రపంచంలో మానవ వనరుల (హెచ్ఆర్) విభాగం నిరంతరం అభివృద్ధి చెందుతోంది.కంపెనీల్లో హెచ్ఆర్ ప్రాముఖ్యత నిరంతరం పెరుగుతోంది.

ఒక సంస్థ విజయవంతం కావడానికి, మానవవనరులను సమర్ధవంతంగా ఉపయోగించాలి అంటే, మానవశక్తిని సద్వనియోగం చేయాలి.ఇది పూర్తిగా హెచ్ ఆర్‌పై ఆధారపడి ఉంటుంది.

హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత కూడా ప్రణాళిక, విశ్లేషణ, కమ్యూనికేషన్ ఇతర విభాగాల్లో ఇప్పటికీ మానవ వనరుల అవసరం ఎంతగానో ఉంది.భారతదేశంలో హెచ్ఆర్ సగటు జీతం దాదాపు రూ.

సంవత్సరానికి 5,00,000, అయితే, ఇది పూర్తిగా వ్యక్తి నైపుణ్యాలు, అర్హతలపై ఆధారపడి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube