సరిగ్గా ఐదేళ్ల క్రితం.దేవి శ్రీ ప్రసాద్ అంటే ఒక బ్రాండ్.
స్టార్ హీరో సినిమా ఏదైనా తెరమీదికి వచ్చింది అంటే చాలు ఇక సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఫిక్స్.అందుకే దేవిశ్రీ రాక్ స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు.
ఇక దేవిశ్రీ ఎలాంటి పాట కంపోజ్ చేసిన అది యూత్ అందరిని కూడా తెగ ఆకర్షిస్తూ ఉండేది.అంతలా టాలీవుడ్లో హవా నడిపించాడు దేవిశ్రీప్రసాద్.
ఇక కొంత మంది స్టార్ హీరోలు హారిస్ జైరాజ్, అనిరుద్, ఏ ఆర్ రెహమాన్ ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్ అని పెట్టుకునేవారు.కానీ ప్రస్తుతం టాప్ లో కొనసాగుతున్న థమన్ మాత్రం హీరోలు పట్టించుకునే వారే కాదు.
దీంతో అప్పట్లో తమన్ అడపాదడపా ఛాన్సులు మాత్రమే అందుకునే వాడు.
అంతేకాదండోయ్ థమన్ కు కాపీ క్యాట్ అంటూ ఒక ముద్ర కూడా పడిపోయింది.
ఇక అప్పట్లో దేవిశ్రీ బిజీగా ఉండడంతో స్టార్ హీరోల సినిమాలకు అసలు దొరికే వాడు కాదు.కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి.టాలీవుడ్ లో సీన్ మొత్తం రివర్స్ అయింది.ఒకప్పుడు స్టార్ హీరోలు అసలు పట్టించుకోనీ తమన్నా కాస్త ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకు మోస్ట్ వాంటెడ్ గా మారిపోయాడు.
ప్రస్తుతం ఏ స్టార్ హీరో సినిమాకు అయినా సరే తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.థమన్ అందిస్తున్న సంగీతం ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగిస్తోంది.
ఇక తమన్ డైరెక్షన్ లో వచ్చిన ప్రతి పాటా కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.కోట్లల్లో వ్యూడ్ సొంతం చేసుకుంటూ రికార్డులు తిరగ రాస్తున్నాయ్.

ఇక బన్నీ అలా వైకుంఠపురం సినిమాలో థమన్ స్టామినా ఎంటో సౌత్ ఇండస్ట్రీ కి అర్థమైపోయింది అంటూ ఉంటారు ఎంతోమంది.అలా వైకుంఠపురం లో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటే అందులో తమన్ మ్యూజిక్ కూడా ఒక పాత్ర వహించింది అని చెబుతూ ఉంటారు.ఇలా ప్రస్తుతం పెద్ద సినిమాలు మొత్తం థమన్ చేతిలోనే ఉన్నాయి.ఏ సినిమాలను కూడా వదులుకోవడం లేదు.పెద్ద సినిమాలకు చిన్న సినిమాలకు ఒకే లాగా పని చేస్తున్నాడూ.దీంతో ప్రస్తుతం అందరూ థమన్ ను తమ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకోవాలి అనుకుంటున్నారు.
అయితే ఇలా థమన్ తో పోలిస్తే అందనంత ఎత్తులో ఉన్న దేవిశ్రీప్రసాద్ కు ఇక ఇప్పుడు ఎక్కువగా అవకాశాలు రాకపోవడానికి కారణం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది.







