టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలోని క్లాసిక్ సినిమలలో 7/జీ బృందావన కాలనీ( 7/G Brundavan Colony ) సినిమా కూడా ఒకటి.ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమాకు సీక్వెల్ కోసం చాలామంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమా మేకర్స్ కూడా సీక్వెల్ దిశగా అడుగులు వేస్తుండటం ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలిగిస్తోంది.
దర్శకుడు సెల్వ రాఘవన్( Director Selva Raghavan ) రవికృష్ణతో ఈ సినిమా సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారు.7/జీ బృందావన కాలనీ సినిమా తర్వాత రవికృష్ణ( Ravikrishna ) ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించలేదనే సంగతి తెలిసిందే.కొన్ని సినిమాలలో రవికృష్ణ నటించినా ఆ సినిమాలు ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేదు.7/జీ బృందావన కాలనీ సినిమాకు సీక్వెల్( 7/G Brundavan Colony Sequel ) కరెక్ట్ కాదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
7/జీ బృందావన కాలనీ సినిమా ఎక్కడ ముగిసిందో అక్కడినుంచి ఈ సినిమా మొదలవుతుందని తెలుస్తోంది.మరో కొత్త అమ్మాయి హీరో జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏం జరిగిందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని భోగట్టా.7/జీ బృందావన కాలనీ ఇప్పటికీ బుల్లితెరపై మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమాలలో ఒకటనే సంగతి తెలిసిందే.
7/జీ బృందావన కాలనీ సినిమా 2004 సంవత్సరంలో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.7/ జీ బృందావన కాలనీ సినిమా సక్సెస్ కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.7/ జీ బృందావన కాలనీ సినిమాలో సోనియా అగర్వాల్( Sonia Agarwal ) అద్భుతంగా నటించారు.ఈ సినిమా ఇతర భాషల్లో సైతం రీమేక్ అయిన సంగతి తెలిసిందే.రవిక్రిష్ణ వయస్సు ప్రస్తుతం 41 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.రవికృష్ణ ఈ సీక్వెల్ తో ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తారో చూడాల్సి ఉంది.