ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా యుగంలో ప్రపంచాన్న ఏ మూలన ఏమి జరిగినా కానీ అందరికీ విషయం త్వరిగతన తెలిసిపోతుంది.అయితే, తాజాగా ముంబైలో ఫ్రీ ఫుడ్ అందిస్తున్న ఒక వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది.
ఫుడ్ కోసం వచ్చిన వారు కచ్చితంగా జై శ్రీరామ్ అని చెప్తేనే ఆహారాన్ని అందజేస్తున్నాడు ఆ వ్యక్తి.కానీ, ముఖానికి ముసుగు కట్టుకొని ఒక మహిళ మాత్రం అలా చెప్పను కానీ ఖచ్చితంగా ఫుడ్ కావాలని డిమాండ్ చేసింది.
అయితే.ఈ క్రమంలో ఆ అంకుల్ మాత్రం జైశ్రీరామ్ చెప్పకపోతే మాత్రం ఆహారం ఇచ్చేది లేదు అంటూ తెలియజేశాడు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళ్తే.
వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ముంబైలోని టాటా ఆసుపత్రికి (TATA distributing) సమీపంలో ఒక వ్యక్తి తన సొంత డబ్బులతో ఆహారాన్ని ఫ్రీగా అందరికీ పంచి పెడుతున్నాడు.కానీ ఒక్క కండిషన్.ఫుడ్ తీసుకునేవారు మాత్రం ఖచ్చితంగా జైశ్రీరామ్ (Jai Sriram)అని చెప్పాల్సిందే.ఇలా జైశ్రీరామ్ చెప్పి కొంతమంది ఆహారం తీసుకుంటూ ఉంటే మరి కొందరు అక్కడి నుంచి ఇష్టం లేక వెళ్ళిపోతున్నారు.
అయితే ఈ క్రమంలో ఒక మహిళ మాత్రం తాను జైశ్రీరామ్ చెప్పనని.కానీ ఫుడ్ మాత్రం కావాలని డిమాండ్ చేసింది.ఆమెకు సపోర్టుగా మరొక వ్యక్తి వచ్చి జైశ్రీరామ్ ఆ మహిళ చెప్పనందుకు ఆమెను టెర్రరిస్ట్ (terrorist)అన్నాడని, న్యూసెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు.కానీ.
నిజానికి అక్కడ ఉన్న వారందరూ కానీ ఆ వ్యక్తి మహిళను టెర్రరిస్ట్ అని అనలేదని తెలిపారు.ఆయన తన సొంత డబ్బుతో ఇలా పంపిణీ చేస్తున్నాడు కనుక ఎవరికి ఇవ్వాలో.
ఎవరికి ఇవ్వకూడదో అతని ఇష్టమని అని కొందమంది అంటున్నారు.అతను కేవలం జైశ్రీరామ్ అనే చెప్పమన్నాడు.
తప్ప బాంబులు పేల్చమని చెప్పలేదు కదా అని మరికొందరు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.