ప్రియుడితో జంప్ అవ్వడానికి ప్రయత్నించిన మహిళా కానిస్టేబుల్.. భర్త ఎంట్రీతో?

ప్రస్తుత సమాజంలో రోజురోజుకు మూడు ముళ్ల బంధానికి విలువ లేకుండా పోతుంది.పరాయి వ్యక్తి మోజులో పడి వారి వైవాహిక జీవితాన్ని చిక్కులలో పడేసుకుంటున్నారు కొంత మంది.

 A Female Constable Who Tried To Jump With Her Boyfriend.. With Her Husband's Ent-TeluguStop.com

కష్టమైనా, సుఖమైన నిండు నూరేళ్లు కలిసి జీవించాల్సింది పోయి వివాహతర సంబంధాలు పెట్టుకొని దారుణాలకు పాల్పడుతున్నారు.దీంతో కుటుంబాల జీవితాలు గందరగోళంగా ఉండడంతోపాటు, వారి పిల్లలు కూడా అనాధలు అవుతున్నారు.

ఇలా వివాహేతర సంబంధాల కారణంగా వారి బంగారు జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు.అచ్చం అలాంటి సంఘటనని ఒకటి మహిళా కానిస్టేబుల్(female constable ) మరొక వ్యక్తితో వివాహరతర సంబంధం పెట్టుకొని భర్తను కాదని ప్రియుడుతో వెళ్లిపోవడానికి సిద్ధపడింది.

మహిళా కానిస్టేబుల్ ప్రియుడుతో కలిసి రైల్వే స్టేషన్(Railway station) చేరుకోగా ఆ సమయంలో ఆమె భర్త వచ్చి పారిపోతున్న వారి ఇద్దరినీ పట్టుకొని దాడికి పాల్పడ్డాడు.ఈ సంఘటన చూసి అక్కడ ఉన్నవారు అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.ఈ సంఘటన మొత్తం బీహార్‌లోని పాట్నా(Patna) రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది.బీహార్ కు చెందిన ఒక మహిళ కానిస్టేబుల్ ప్రియుడితో కలిసి పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు.

ఇంతలో తన భార్య మరొక వ్యక్తితో పారిపోతున్న విషయం తెలుసుకొని వెంటనే తన భర్త రైల్వే స్టేషన్ కు చేరుకొని వారిద్దరిపై ఆగ్రహానికి గురయ్యాడు.భార్య ముందే ఆ ప్రియుడిపై పిడి గుద్దులు కురిపించడంతోపాటు తన భర్త నుంచి ప్రియుడిని విడిపించేందుకు తెగ ప్రయత్నం చేసింది ఆ మహిళ కానిస్టేబుల్.

అయినా కానీ, భర్త మాత్రం ఏ మాత్రం తగ్గకుండా దాడికి పాల్పడ్డాడు.కానీ.ఆ మహిళా మాత్రం ప్రియుడిని ఏమి కాకుండా అడ్డు పడింది.ఇలా ఒక్కసారిగా దాడికి దిగడం అక్కడ ఉన్న ప్రయాణికులు కూడా ఆపేందుకు ప్రయత్నం చేసారు.కానీ, అతను మాత్రం వినలేదు.ప్రియుడికి దెబ్బలు తగలకుండా ప్రయత్నాలు చేసింది.

ఇక చివరకు ప్రియుడు అక్కడి నుంచి పారిపోయాడు.ఇలా దాడి చేసిన అనంతరం సీఆర్పీఎఫ్(CRPF) భర్త తన భార్యను తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేసిన కానీ ఆమె మాత్రం అందుకు అంగీకరించలేదు.

ఇక ఈ సంఘటన చూసిన వారందరూ కూడా ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.సిఆర్ఎఫ్ భర్తను కాదని ప్రియుడుతో పారిపోయేందుకు సిద్ధమైన ఆ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు తప్పుడు మార్గంలో వెళ్లే వారికి బుద్ధి చెప్పాల్సిన ఒక కానిస్టేబుల్ అయ్యుండి ఇలా చేయడం ఏంటా అని కామెంట్ చేస్తున్నారు.

ఇక మరికొందరైతే ఎవరి జీవితం వారిది వారికి ఇష్టం వచ్చినట్లు వారు ఉంటారు మనకెందుకు అని కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube