మనం చాలా రోజులుగా ట్యాలెంట్ ఉండి ఇంకా పరిశ్రమ గుర్తించని నటుల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం.ఈ రోజు అలంటి ఒక నటుడి గురించి పక్క తెలుసుకోవాల్సిందే.
అతడు మరెవరో కాదు కార్తీక్ రత్నం.కంచరపాలెం సినిమాలో 2018 లో నటించి తొలిసారి తెలుగు సినిమా రంగానికి పరిచయం అయ్యాడు.
ఈ సినిమాలో అతడి నటన గురించి ఎంత చెప్పిన తక్కువే.చిన్న సినిమాగా వచ్చి విడుదల ఘనవిజయం సాధించిన కంచరపాలెం సినిమా కేవలం కార్తీక్ రత్నం వల్లే హిట్ అయ్యిందంటే ఎలాంటి అతిశయోక్తి లేదు.
సినిమాల్లో నటించాలనే తపనతో తెలుగు థియేటర్స్ లో కూడా పని చేసాడు కార్తీక్.
నటన మీద ఉన్న పిచ్చి అతడి సీఏ చదువును కూడా పక్కన పడేసేలా చేసింది.
మొదట బొరుసు లేని బొమ్మ అనే థియేటర్ లో నటించగా దేనికి గాను నంది అవార్డు కూడా గెలుచుకున్నాడు.ఇక లాభం లేదు అనుకోని తన చావును ఆపేసి పూర్తి స్థాయి నటుడిగా మారి ఈ నాటకాన్ని 30 సిటీలలో ప్రదర్శన ఇచ్చాడు.
ఇక ఈ నాటకాన్ని చుసిన జోషేప్ కంచరపాలెం సినిమాలో అవకాశం ఇవ్వగా ఈ సినిమా న్యూ యార్క్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా ప్రసారం అయ్యింది.ఇక ఈ సినిమా తర్వాత ఓరి డైరెక్ట్ చేసిన గాడ్స్ ఆఫ్ ధర్మపురి అనే వెబ్ సిరీస్ లో నటించాడు.
ఈ సిరీస్ జీ 5 లో అందుబాటులో వుంది.కార్తీక్ రత్నం కోసం అయినా మరొకసారి ఈ సిరీస్ చూడచ్చు.
ఇక ఆ తర్వాత జోసెఫ్ దర్శకత్వంలోనే కాదల్ అనే తమిళ సినిమాలో నటించాడు.ఆ తర్వాత అర్ద శతాబ్దం, నారప్ప సినిమాల్లో నటించగా కార్తీక్ కి చాల మంచి పేరు వచ్చింది.
ఇక ఈ ఏడాది రౌడీ బాయ్స్ అనే సినిమాలో నటించిన కార్తీక్ తన కెరీర్ మొత్తం లో కేవలం ఆరు సినిమాలు ఒక సిరీస్ మాత్రమే తీసాడు.కానీ పుష్కలమైన ట్యాలెంట్ ఉన్న నటుడు.
ఇంకా సరైన గుర్తింపు రాలేదు కానీ అతి త్వరలో ఒక విభిన్నమైన నటుడిగా కార్తీక్ ఎదుగుతాడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.అతడి ప్రతిభకు కేవలం కంచరపాలెం,అర్ద శతాబ్దం, నారప్ప సినిమాలు చాలు అతడి ట్యాలెంట్ ఏంటో చెప్పడానికి.







