సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.విజయనగరం జిల్లా ఎస్ కోటలో దాసరి సామాజికవర్గంతో ఆయన సమావేశం నిర్వహించారు.
అనంతరం మాట్లాడుతూ తనది ముందు చూపని, జగన్‌ది దొంగ చూపు అంటూ విమర్శలు గుప్పించారు.
ఆర్థిక సంస్కరణలు చేపట్టి సంపదను సృష్టించిన ఘనత టీడీపీదని చంద్రబాబు తెలిపారు.
సాంకేతిక విప్లవాన్ని తెచ్చిందే టీడీపీ అని అన్నారు.పేదవాళ్లని ధనికులుగా మార్చడమే తన ముందున్న లక్ష్యమన్నారు.
పేదవాళ్లని ఎగతాళి చేసేలా జగన్ పాలన ఉందని విమర్శించారు.







