అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 2020 న జరిగిన అధ్యక్ష ఎన్నికల సమయంలో ప్రవర్తించిన తీరు అందరికి గుర్తు ఉండేఉంటుంది.అమెరికా చరిత్రలో ఎన్నడూ ఎన్నికలు ఈ స్థాయిలో చర్చనీయాంశం కాలేదు.
అంతేకాదు క్యాపిటల్ హిల్ పై దాడి ఘటన యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.ఈ పరిణామాలు అన్నిటికి ట్రంప్ కారణమని కూడా ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఎన్నికల్లో అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలంటూ ట్రంప్ కోర్టుల చుట్టూ తిరుగగా కోర్టులు కూడా ట్రంప్ వాదనలను పక్కన పెట్టింది.ఎన్నికలు న్యాయపరంగా జరిగాయని ఎలాంటి తప్పుదోవ పట్టలేదని తీర్పు చెప్పింది.అయితే.
2020 ఎన్నికల సమయం మొదలు ఎలాంటి పరిణామాలు జరిగాయి ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు.ట్రంప్ ప్రవర్తనా శైలి ఇలాంటి ఆధారాలతో ఓ సినిమా చిత్రీకరించబడింది.భారత సంతతికి చెందిన దినేష్ డిసౌజా అనే వ్యక్తి అప్పటి సంఘటనల ఆధారంగా కధను రాసుకుని 2000 – Mules అనే పేరుతో తెరకెక్కించారు./br>

ఈ కధ ఆధారంగా సినిమా తీస్తున్న తరుణంలో ఎంతో మంది దినేష్ ను వద్దని వారించారు.పెద్ద సక్సెస్ కాదు డబ్బులు ఎందుకు దండుగ అంటూ వెనక్కి లాగారు కానీ దినేష్ ఎక్కడా రాజీపడలేదు.అనుకున్న విధంగా సినిమా తీసి రిలీజ్ చేసారు.మొదటి రోజు పెద్దగా స్పందన లేకపోయినా తరువాత అమెరికన్స్ సినిమా హాల్స్ ముందు క్యూ కేట్టేశారు.విమర్శకులు సైతం అవ్వక్కయ్యేలా ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చింది.అమెరికా వ్యాప్తంగా మే -20 న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు కాసుల పంట పండిస్తోంది.ప్రస్తుతం ఈ సినిమా రూ.10 కోట్లు పైగా వసూళ్లు రాబట్టిందని తెలుస్తోంది.







