యూకే: క్వీన్స్ బర్త్ డే ఆనర్స్ లిస్ట్‌లో 40 మంది భారత సంతతి ప్రముఖులు.. సల్మాన్ రష్దీ కూడా..!

బుకర్ ప్రైజ్ విజేత, భారత సంతతికి చెందిన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీకి మరో అరుదైన ఘనత దక్కింది.క్వీన్స్ బర్త్ డే ఆనర్స్ లిస్ట్‌లో స్థానం పొందిన 40 మందిలో ఆయన అగ్రస్థానంలో వున్నారు.

 Salman Rushdie Among 40 Indian Origin Notables In Queen's Birthday Honours List,-TeluguStop.com

క్వీన్ ఎలిజబెత్ 2 సింహాసనాన్ని అధిష్టించి 70 ఏళ్లు గడుస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని బ్రిటన్‌లో ప్లాటినమ్ జూబ్లీ వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే.దీనిలో భాగంగా బుధవారం రాత్రి జూబ్లీ ఆనర్స్ జాబితాను విడుదల చేశారు.

సాహిత్య రంగానికి విశేష సేవలందించిన సల్మాన్ రష్దీకి ఇందులో చోటు దక్కింది.అంతేకాదు.

కేవలం 65 మందికి మాత్రమే చోటున్న ప్రత్యేక క్లబ్‌లో కంపానీయన్ ఆఫ్ ఆనర్‌గానూ స్థానం దక్కించుకున్నారు.

తన వివాదాస్పద నవల ‘‘ది సాటానిక్ వెర్సెస్’పై ఇరాన్ అగ్రనేత అయతోల్లా ఖొమేనీ ఫత్వాకు గురైన 74 సల్మాన్‌కు ఈ గుర్తింపు లభించడం విశేషమే.

కంపానీయన్ ఆఫ్ ఆనర్ అనేది కళలు, సైన్స్, మెడిసిన్ లేదా ప్రభుత్వానికి ఎక్కువ కాలం సేవలు అందించిన వారికి అందించే ప్రత్యేక అవార్డు. బ్రిటీష్ మాజీ ప్రధాన మంత్రులు విన్‌స్టన్ చర్చిల్, జాన్ మేజర్, ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ వంటి వారికి మాత్రమే లభించిన ఈ అత్యున్నత గౌరవాన్ని మరికొద్దిమంది మాత్రమే అందుకున్నారు.

Telugu Bookerprize, Queen Elizabeth, Queenshonours, Salman Rushdie-Telugu NRI

బొంబాయిలో జన్మించిన సల్మాన్.అనంతరం కేంబ్రిడ్జ్‌లోని రగ్బీ స్కూల్, కింగ్స్ కాలేజీలో చదువుకున్నారు.ఆయన రచించిన మిడ్‌నైట్స్ చిల్డ్రన్‌కు రెండు సార్లు (1993, 2008)లలో బుకర్ ప్రైజ్‌ లభించింది.2007లో సాహిత్యానికి చేసిన సేవలకు గాను నైట్‌ బిరుదు పొందారు.క్వీన్స్ ప్లాటినం జూబ్లీ వేడుకల సందర్భంగా మరికొందరికి రాయల్ అవార్డులను ప్రకటించారు.కేర్ ఇంగ్లాండ్ చైర్ అయిన అవ్నీష్ మిట్టర్ గోయల్‌ను కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్‌ (సీబీఈ) అవార్డుకు ఎంపిక చేశారు.

సామాజిక సేవా, దాతృత్వానికి గాను గోయల్‌కు ఈ అవార్డ్ ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube