దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక హెయిర్ ప్రాబ్లమ్( Hair Problem )తో ఇబ్బంది పడుతూనే ఉంటారు.హెయిర్ ఫాల్, డ్రై హెయిర్, హెయిర్ గ్రోత్ అనేది లేకపోవడం, డాండ్రఫ్ ఇలా ఏదో ఒక సమస్యతో సతమతం అవుతుంటారు.
వాటి నుంచి బయటపడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే ఎప్పుడు చెప్పబోయే మ్యాజికల్ టానిక్ మీకు చాలా బాగా సహాయపడుతుంది.
వారానికి ఒక్కసారి ఈ టానిక్ ను వాడారంటే మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినట్లే.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ టానిక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టి అందులో ఒకటిన్నర గ్లాసు బియ్యం కడిగిన నీళ్లు పోసుకోవాలి.ఈ వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో మూడు రెబ్బలు కరివేపాకు, రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు, వన్ టేబుల్ స్పూన్ డ్రై రోజ్ మేరీ మరియు అర కప్పు ఎండిన గులాబీ రేకులు( Dry Rose Petals ) వేసుకుని దాదాపు 15 నిమిషాల పాటు ఉడికించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ గోరువెచ్చగా అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్( Sweet Almond Oil ) వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన హెయిర్ టానిక్ రెడీ అవుతుంది.ఈ హోమ్ మేడ్ టానిక్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.ఆపై స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు తయారుచేసుకున్న టానిక్ ను స్ప్రే చేసుకోవాలి.
గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒక్కసారి ఈ విధంగా చేశారంటే ఎన్నో అద్భుత లాభాలు పొందుతారు.
ముఖ్యంగా ఈ మ్యాజికల్ టానిక్ హెయిర్ గ్రోత్ ను ఇంప్రూవ్ చేస్తుంది.జుట్టును కుదుళ్ల నుంచి స్ట్రాంగ్ గా మారుస్తుంది.జుట్టు రాలడాన్ని అరికడుతుంది.అలాగే ఈ టానిక్ ను వాడటం వల్ల చుండ్రు సమస్య( Dandruff ) దూరం అవుతుంది.స్కాల్ప్ హెల్తీ గా మారుతుంది.ఈ టానిక్ తయారీలో వాడిన అవిసె గింజలు, విటమిన్ ఈ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ డ్రే హెయిర్ ను రిపేర్ చేస్తాయి.
జుట్టును హైడ్రేటెడ్ గా మృదువుగా మారుస్తాయి.కాబట్టి ఆరోగ్యమైన కురులను కోరుకునే వారు తప్పకుండా ఈ మ్యాజికల్ టానిక్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.