లోక్ సభ ఎన్నికలు( Loksabha Elections ) సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల ఎంపికపై రెండు జాతీయ పార్టీలు దృష్టి సారించాయి.ఇప్పటికే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన జాతీయ పార్టీలు బీజేపీ,( BJP ) కాంగ్రెస్( Congress ) రెండో జాబితా అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నాయి.
ఈ మేరకు రెండు పార్టీలు ఇవాళ కీలక సమావేశాలు నిర్వహించనున్నాయి.ఇందులో భాగంగా సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది.
సుమారు 150 కిపైగా అభ్యర్థుల పేర్లతో రెండో జాబితాను బీజేపీ సిద్ధం చేయనుంది.ఈ క్రమంలోనే తెలంగాణలో ( Telangana ) మిగిలిన ఎనిమిది స్థానాలకు దాదాపుగా అభ్యర్థులు ఖరారు అయ్యారని తెలుస్తోంది.
అయితే ఇప్పటికే 195 పేర్లతో కమలదళం తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే.మరోవైపు సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ( Congress Election Committee ) సైతం భేటీ కానుంది.ఈ సమావేశంలో పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో పాటు కీలక నేతలు పాల్గొననున్నారు.ఈ సమావేశంలో ప్రధానంగా ఏపీ, రాజస్థాన్, హర్యానా, ఛత్తీస్ గఢ్, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ మరియు ఢిల్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా ఈ నెల 8న 39 స్థానాలకు హస్తం పార్టీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.