ఏపీలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ తమ పార్టీ తరపు నుంచి వైసీపీ అభ్యర్థులను ప్రకటించనుంది.ఈ మేరకు తొమ్మిది మంది అభ్యర్థుల ఎంపికను సీఎం జగన్ ఫైనల్ చేయనున్నారు.
కాగా ఈ అభ్యర్థులలో ఇప్పటికే ఇద్దరి పేర్లు ఖరారైయ్యాయి.జయ మంగళ వెంకటరమణ, కుడుపూడి సూర్యనారాయణ పేర్లను అధిష్టానం ఖరారు చేసింది.
ఈ క్రమంలో మిగిలిన ఏడు స్థానాలకు అభ్యర్థులపై ఇవాళ తుది కసరత్తు జరగనుంది.కాగా సామాజిక సమీకరణాల వారీగా సీఎం జగన్ పెద్దపీట వేయనున్నారు.
కడప జిల్లా నుంచి రామసుబ్బారెడ్డి, నెల్లూరు నుంచి మెరుగు మురళి, అనంతపురం నుంచి నవీన్ నిచ్చల్, పశ్చిమ గోదావరి నుంచి గుమ్మం నాగబాబు, వంకా రవీంద్రా, తూర్పుగోదావరి జిల్లా నుంచి బొమ్మ ఇజ్రాయిల్ పేర్లు ఖరారయ్యే అవకాశం ఉంది.ఈ క్రమంలో ఇవాళ మరోసారి పార్టీ నేతలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.







