సోషల్ మీడియా నేడు ఎన్నో రకాల వీడియో కంటెంట్ కి అడ్డాగా మారింది.క్రియేటర్ల ఉత్సాహాన్ని, సామాన్య జనాల అత్యుత్సాహాన్ని సోషల్ మీడియా బాగానే క్యాష్ చేసుకుంటోంది.
వ్యూస్, యాడ్స్ వంటి వాటి వలన డబ్బు రావడంతో చాలామంది నేడు పలు సోషల్ మీడియాలను ఒక ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు.ఇక సోషల్ మీడియా గణనీయంగా పెరిగిపోవడంతో నిత్యం ఇక్కడ రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా.సముద్రంలో జరిగిన వింత ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక ఈ వీడియో చూసి నెటిజన్లు అయితే షాక్ కి గురవుతున్నారు.అయితే ఆ పరిస్థితులలో అక్కడే వున్న వారికి ఇంకెలాంటి అనుభవం కలుగుతుందో అర్ధం చేసుకోవచ్చు.సాధారణంగా సముద్రపు ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతుంటాయి.సముద్రంలో జరిగిన ఎన్నో ఆసక్తికర ఘటనలను ఇప్పటికే చాలాసార్లు చూసుంటారు.సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ప్రస్తుత వీడియోని గమనిస్తే, మొదట సముద్రంలో ఓ వింత రూపం కనిపిస్తుంటుంది.ఈ క్రమంలో దాన్ని చిత్రీకరిస్తున్న వ్యక్తి.
ఆ వింత రూపం ఏంటా.అంటూ దగ్గరికి వెళ్లాడు.
ఈ క్రమంలో అది భయంకరంగా కనిపిస్తుంటుంది.
అవును, ఆ ఆకారాన్ని చూసి మొదట అతను ఏదో ఒక పడవ మునిగిపోయినట్టుందని అనుకున్నాడు.కానీ అకస్మాత్తుగా అది రూపం మార్చుకుంటుంది.బోటు అనుకోని తీరా దగ్గరికి వెళ్లి చూసేసరికి అది ఓ భారీ తిమంగిలం.
అని అర్ధమవుతుంది.అవును, అప్పటివరకు నోరు తెరిచి ఉన్న తిమింగిలం ఒక్కసారిగా నీటిలోకి వెళ్లిపోతుంది.
అయితే, అది నోరు ఆహారం తినేందుకు తెరిచిందా? లేక నీరు తాగేందుకు తెరిచిందా అనేది మాత్రం ఎవరికీ అర్ధం కావడం లేదు.మీకు ఒకవేళ తెలిస్తే కింద కామెంట్ చేయండి.
ఈ వీడియోను roam_the_oceans అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.లక్షలమంది చూస్తున్నారు.