దానికి సంబంధించి తనకేమీ తెలియదంటున్న అందాల రాక్షసి

అందాల భామ లావణ్య త్రిపాఠి ప్రస్తుతం వరుస ఫ్లాపులతో గతకొంత కాలంగా ఫేడవుట్ అవుతూ వస్తోంది.ఇటీవల నిఖిల్ హీరోగా తెరకెక్కిన అర్జున్ సురవరం చిత్రం యావరేజ్ హిట్‌గా నిలవడంతో ప్రస్తుతం ఆమె ఓ సినిమాలో నటిస్తుంది.

 Lavanya Tripathi Unaware Of Hockey For A1 Express-TeluguStop.com

యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం ఏ1 ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ సినిమాలో సందీప్, లావణ్య త్రిపాఠి ఇద్దరు కూడా హాకీ ప్లేయర్లుగా నటిస్తున్నారు.

అయితే లావణ్యకు ఈ ఆట గురించి ఏమాత్రం తెలియదట.తను హాకీ ఆట గురించి వినడమే తప్ప అది ఎలా ఆడతారో కూడా తెలియదని చెప్పుకొచ్చింది.

కాగా తన చిన్నతనం నుండి స్కూల్, కాలేజీలో బ్యాడ్మింటన్ మరియు క్రికెట్ మాత్రమే ఆడేవారని తెలిపింది.ఇక ఈ సినిమాలో హాకీ ఆట ఉండటంతో ఆటకు సంబంధించి చాలా కష్టపడుతుందట.

ఇక ఈ సినిమాలో అమ్మడు ఆర్ఎక్స్ 100 బైక్ కూడా నడిపినట్లు చెప్పుకొచ్చింది.మొత్తానికి సినిమాలో నటించేందుకు తాను కష్టపడి హాకీ నేర్చుకుంటున్నట్లు తెలపడంతో ఆమె ఈ సినిమాలో ఏ రేంజ్‌లో హాకీ ఆడుతుందో చూడాలి అంటున్నారు ప్రేక్షకులు.

ఇక ఈ సినిమాను డెన్ని్స్ జీవన్ కణుకొలను డైరెక్ట్ చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube