మెగాస్టార్ చిరంజీవి ని ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీ కి వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.కానీ అందరూ సక్సెస్ అవ్వలేదు, ఎవరో ఒకరిద్దరు రవితేజ లాంటోళ్ళు సక్సెస్ అయ్యారు.
సక్సెస్ అయిన రవితేజ కి మాత్రమే టాలెంట్ ఉంది, మిగిలిన వాళ్లకు లేదు అని కాదు. రవితేజ కి టాలెంట్ తో పాటుగా అదృష్టం కూడా కలిసి వచ్చింది, మిగిలిన వాళ్లకు అది జరగలేదు, అంతే తేడా.
ఇదంతా పక్కన పెడితే రవితేజ హీరో కాకముందు స్టార్ డైరెక్టర్స్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు.ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగా కమెడియన్ గా కూడా పలు సినిమాలు చేసాడు.
అలా నటుడిగా తనని తానూ నిరూపించుకుంటూ హీరో అయ్యాడు.ఒకప్పుడు వేరే హీరో సినిమాల్లో సైడ్ ఆర్టిస్టుగా చేసిన రవితేజ, అదే హీరోలు ఇప్పుడు రవితేజ సినిమాలో సైడ్ ఆర్టిస్టుగా చేస్తున్నారు.
అది రవితేజ సాధించిన విజయం.

ఇది ఇలా ఉండగా రవితేజ కేవలం సినిమాల్లో మాత్రమే నటించాడు అని మీరు అనుకోవచ్చు.కానీ ఆయన గతం లో ఒక టీవీ సీరియల్ లో కూడా నటించాడు.ఈ విషయం ఎవరికీ తెలియదు.
అప్పట్లో దూర దర్శన్ లో ప్రసారం అయ్యే ‘ఋతురాగాలు’ అనే సీరియల్ లో ఒక ఎపిసోడ్ లో చిన్న పాత్రలో కనిపిస్తాడు రవితేజ.ఈ సీరియల్ అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.
సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ చేసుకుంటున్న రోజుల్లో రవితేజ చేసిన సీరియల్ ఇది.ఈ సీరియల్ తర్వాత రవితేజ కి ఎన్నో సీరియల్స్ లో ఆఫర్స్ వచ్చాయి కానీ, ఆయన ఒప్పుకోలేదు.ఈ సీరియల్ లో రాజీవ్ కనకాల హీరో గా నటించగా, రూపా దేవి హీరోయిన్ గా నటించింది.ఇప్పుడు ఈ సీరియల్ ఆన్లైన్ లో అందుబాటులో లేదు.
అలా చిన్న చిన్న పాత్రలు చేసుకునే రవితేజ ఇప్పుడు స్టార్స్ లో ఒకడిగా నిలుస్తాడని ఎవ్వరూ ఊహించలేదు.

ఇక రవితేజ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే రీసెంట్ గానే ఆయన మన ముందుకి టైగర్ నాగేశ్వర రావు చిత్రం తో వచ్చాడు.ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అయ్యింది.ఈ చిత్రం తర్వాత ఆయన ఈగల్( Eagle ) అనే చిత్రం చేసాడు.
ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది.ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
కచ్చితంగా ఈ సినిమా రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని ఆయన ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.
.