రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కేజీఎఫ్ చాప్టర్ 2.కేజీఎఫ్ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా మీద మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
కన్నడ ఇండస్ట్రీ చరిత్రలో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన కేజీఎఫ్ సినిమా అక్కడ ఇండస్ట్రీ రికార్డులని సృష్టించింది.అలాగే పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని నమోదు చేసింది.
ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్ కి స్టార్ ఇమేజ్ వచ్చేసింది.అతనితో సినిమాలు చేయడం కోసం పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు క్యూ కట్టాయి.
ఈ నేపధ్యంలో సంజయ్ దత్, రవీనా టాండన్ లాంటి స్టార్ నటులతో కేజీఎఫ్ చాప్టర్ 2ని మరింత భారీ బడ్జెట్ తో ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్ ఈ సినిమాలలో కీలక పాత్రలు చేశారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ యష్ పుట్టిన రోజు సందర్భంగా తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకి వచ్చిన టీజర్ అందరి అంచనాలని అందుకోవడంతో పాటు చాప్టర్ 2 ఎలా ఉండబోతుందో అనే విషయాన్ని రివీల్ చేసింది.
రాకీభాయ్ పవర్ ఫుల్ జర్నీని మరింత అద్భుతంగా ఆవిష్కరించారని టీజర్ చూస్తూ ఉంటే తెలుస్తుంది.టీజర్ లో సినిమాలో ఉన్న అన్ని మెయిన్ పాత్రలని దర్శకుడు రివీల్ చేశాడు.
ఇదిలా ఉంటే ఈ టీజర్ సోషల్ మీడియాలో రిలీజ్ అయిన తర్వాత వరుస రికార్డులని నమోదు చేస్తుంది.కేజీఎఫ్ ఫ్యాన్స్ విపరీతంగా టీజర్ ని సెర్చ్ చేస్తున్నారు.
కేవలం 48 గంటల్లో వంద మిలియన్ వ్యూస్ ని ఈ టీజర్ క్రాస్ చేసేసింది అంటే దీని హవా ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు.ప్రభాస్ సాహూ సినిమాకి కూడా ఈ స్థాయిలో వ్యూస్ రాలేదు.
ఇక వంద మిలియన్ వ్యూస్ ని కేవలం రెండు రోజుల్లో క్రాస్ చేసిన కేజీఎఫ్ 2 200 మిలియన్ మార్క్ ని క్రాస్ చేయడానికి ఎంతో సమయం పట్టదని అర్ధమవుతుంది.