మొటిమల తాలూకు మచ్చలు పోవడం లేదా? అయితే చియా సీడ్స్ తో ఇలా చేయండి!

మొటిమలు( pimples ).చాలా కామన్ గా వేధించే చర్మ సమస్యల్లో ఒకటి.

 Chia Seeds Help To Get Rid Of Acne Scars , Chia Seeds, Acne Scars, Acne, Pimple-TeluguStop.com

అయితే కొందరిలో మొటిమలు పోయిన వాటి తాలూకు మచ్చలు మాత్రం అలానే ఉండిపోతాయి.ఆ మచ్చల కారణంగా ముఖం కాంతిహీనంగా కనిపిస్తుంది.

మొటిమల తాలూకు మ‌చ్చ‌ల‌ను వ‌దిలించుకోవడం కోసం తెగ హైరానా పడిపోతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.చియా సీడ్స్( Chia seeds ) మొటిమలు తాలూకు మచ్చలను వదిలించడానికి సమర్ధవంతంగా సహాయపడతాయి.మరి ఇంతకీ చియా సీడ్స్ ని ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు చియా సీడ్స్ వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న చియా సీడ్స్‌ పౌడర్ మరియు ఒక కప్పు రోజ్ వాటర్ ( Rose water )వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్ పై ఆరు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఉడికించాలి.

ఇలా ఉడికించిన మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి ఏదైనా బ్రష్‌ సహాయంతో అప్లై చేసుకుని ముప్పై నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

రోజుకు ఒకసారి ఇలా కనుక చేస్తే మొటిమలు తాలూకు మచ్చలు క్రమంగా మాయమవుతాయి.అలాగే ఇతర ముదురు రంగు మచ్చలు ఉన్నా సరే తగ్గుముఖం పడతాయి.పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల చర్మం టైట్ గా, బ్రైట్ గా మారుతుంది.ముడతలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.స్కిన్ సూపర్ గ్లోయింగ్ గా మెరుస్తుంది.కాబట్టి మొటిమల తాలూకు మచ్చలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube