కీళ్ల నొప్పులు.వయసు పైబడిన కొద్దీ కీళ్లు అరిగిపోయి నొప్పులు పుడుతుంటాయి.
అరవై లేదా డబ్బై ఏళ్లు దాటాక వచ్చే ఈ కీళ్ల నొప్పులు.నేటి ఆధునిక కాలంలో ముప్పై, నలబై ఏళ్లకే ఏర్పడుతుంది.
ఆహారపు అలవాట్లు, మారిన జీవన శైలి, ఒత్తిడి, కాల్షియం లోపం ఇలా రకరకాల కారణాల వల్ల కీళ్ల నొప్పులు వస్తుంటాయి.ముఖ్యంగా ఈ శీతాకాలంలో కీళ్ల నొప్పులు మరింత ఇబ్బందికరంగా ఉంటాయి.
అయితే కీళ్ల నొప్పులతో బాధ పడుతున్న వారికి కొన్న ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.అవేంటో ఆలస్యం చేయకుండా ఓ లుక్కేసేయండి.
కీళ్ల నొప్పులు ఉన్న వారు రెగ్యులర్ ఒక ఆరెంజ్ తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది.ఆరెంజ్‌లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.ఇది ఎముకల పటుత్వాన్ని పెంచి.కీళ్ల నొప్పులను దూరం చేస్తుంది.
అలాగే అరటి పండు కూడా కీళ్ల నొప్పులతో బాధ పడుతున్న వారికి గ్రేట్‌గా హెల్క్ అవుతుంది.రోజుకో అరటి పండు తీసుకుంటే గనుక.
అందులో ఉండే పొటాషియం, మెగ్నిషియం ఎముకల సాంద్రత పెంచి కీలక నొప్పులను తగ్గిస్తుంది.
![Telugu Tips, Healthy, Latest-Telugu Health - తెలుగు హెల్త Telugu Tips, Healthy, Latest-Telugu Health - తెలుగు హెల్త](https://telugustop.com/wp-content/uploads/2020/12/healthy-bones-latest-news-bones-health.jpg )
కీళ్ల నొప్పులు ఉన్న వారు పాలు మరియు పెరుగును ప్రతి రోజు తీసుకోవాలి.పాలు మరియు పెరుగులో పుష్కలంగా ప్రోటీన్లతో పాటు కాల్షియం కూడా ఉంటుంది.తద్వారా కీళ్ల నొప్పులను గుడ్ బై చెప్పొచ్చు.
అలాగే రోజుకు కనీసం ఐదు బాదం పప్పులను డైట్‌లో చేర్చుకోవాలి.ఎందుకంటే, బాదంలో ఉండే కాల్షియం, ఫాస్పరస్ మరియు ఇతర పోషకాలు ఎముకల దృఢత్వాన్ని పెంచి కీళ్ల నొప్పులను దూరం చేస్తుంది.
అలాగే వీటితో పాటు క్యాబేజి, కాలీఫ్లవర్, బీన్స్, కాప్సికం, ముల్లంగి, పచ్చి ఆకు కూరలు, నువ్వులు లాంటివి అధికంగా తీసుకోవాలి.ఫలితంగా ఎముకలు గట్టిపడి.కీళ్ల నొప్పులు తగ్గుముఖం పడతాయి.ఇక వైట్ రైస్, మైదా, ఫాస్ట్ ఫుడ్, వేపుళ్ళు, స్వీట్లు వంటి వాటికి ఎంతో దూరంగా ఉంటే అంత మంచిది.