ప్రస్తుత రోజుల్లో డైనింగ్ టేబుల్ అనేది దాదాపు అందరి ఇళ్లల్లోనూ ఉండే కామన్ వస్తువుగా మారిపోయింది.పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది డైనింగ్ టేబుల్ మీదే కూర్చుని ఫుడ్‌ను తీసుకోవడం అలవాటు చేసుకున్నారు.
అయితే డైనింగ్ టేబుల్‌పై తినడం చూసేందుకు బాగానే ఉంటుంది.కమ్‌ఫర్ట్‌గా కూడా ఉంటుంది.
కానీ, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.డైనింగ్ టేబుల్‌పై కంటే నేలపై కూర్చుని తినడమే మంచిది.
దీనిని ఎవరో కాదు స్వయంగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పైగా నేలపై కూర్చుని ఆహారం తీసుకోవడం వల్ల బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్‌ను తమ సొంతం చేసుకోవచ్చు.
మరి ఆలస్యమెందుకు ఆ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి.మీకు తెలుసా.
నేలపై కూర్చుని ఆహారం తీసుకుంటే బరువు తగ్గుతారట.అవును, నేలపై పద్మాసనంలో కూర్చుని తినడం వల్ల వాగస్ అనే నెర్వ్ పొట్ట నిండిన ఫీలింగ్‌ను సూపర్ ఫాస్ట్‌గా బ్రెయిన్‌కి అందిస్తుంది.
తద్వారా మీరు ఎక్కువా.తక్కువా కాకుండా లిమిట్‌గానే ఫుడ్‌ను తీసుకుంటారు.
ఫలితంగా మీ వెయిట్ మీ కంట్రోల్‌లోనే ఉంటుంది.

అలాగే కింద కూర్చుని నేలపై ప్లేట్‌ను ఉంచి ఆహారం తీసుకుంటే.పొట్టలో ఉండే కండరాలు యాక్టివేట్ అవుతాయి.దాంతో తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.
ఫలితంగా గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.
డైనింగ్ టేబుల్‌పై కాకుండా నేలపైనే కూర్చుని ఫుడ్ తీసుకుంటే.
రక్త ప్రసరణ బాగా జరిగి గుండె ఆరోగ్యంగా మారుతుంది.అంతేకాదు.
నడుము నొప్పి, కీళ్ల నొప్పి, కండరాల నొప్పి మరియు తదితర నొప్పులు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.అదే సమయంలో ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు దూరమై మనసు ప్రశాంతంగా మారుతుంది.
కాబట్టి, ఇప్పుడు చెప్పుకునే ప్రయోజనాలను నష్టపోకూడదు అనుకుంటే.ఇకపై డైనింగ్ టేబుల్‌పై తినేవారు నేలపైకి షిప్ట్ అయిపోండి.