రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రతిరోజు ఉదయం పారిశుధ్య పర్యవేక్షణలో భాగంగా మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య మానేరు బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో పర్యటించగా పెద్ద మొత్తంలో చెత్తను గమనించడం జరిగింది.చెత్తను ఎవరు పడవేశారు అని ఆరా తీయగా గాంధీ చౌక్ లోని కావ్య బెంగళూర్ బేకరీ ( Kavya )నిర్వాహకులు వేసారని తెలిసి వారిని చెత్తను పడవేసిన ప్రాంతానికి పిలిపించి వారికి 10,000 రూపాయలు జరిమాన విధించడం జరిగింది.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ( Municipal Commission ) మాట్లాడుతు గతంలో కూడా పట్టణ శివారు ప్రాంతాల్లో గాని ఓపెన్ ప్లేసులో గాని చెత్తనుపడేసే వారిని గుర్తించి జరిమానాలు వేయడం జరిగిందని అయినా కూడా కొంతమందికి పరిపక్వత రావట్లేదని దానిని ఉద్దేశించి భారీ జరిమానాలు వేయడం జరిగిందని తెలియజేయడం జరిగింది.భవిష్యత్తులో కూడా ఎవరైనా ఇదేవిధంగా చేత్త పడవేసిన కేవలం పాదాచారులకు మాత్రమే కేటాయించిన ట్విన్ బిన్స్ లో గృహ అవసరాలకు సంబంధించిన చెత్తను పడవేసిన ఇదే రకంగా జరిమానాలు విధించడం జరుగుతుందని ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ బి సత్యనారాయణ, సానిటరీ జవాన్ ఉమర్, హెల్త్ అసిస్టెంట్ సుకుమార్ జవాన్లు పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.