టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సింగర్ మంగ్లీ ( Mangli ) ఒకరు.ఫోక్ సాంగ్స్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె ప్రస్తుతం సినిమాలలో ప్లే బ్యాక్ సింగర్ గా పాటలు పాడుతూ పెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక మంగ్లీ పాటలకు కూడా ఎంతో మంచి ఆదరణ రావడంతో ఈమెకు తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా అవకాశాలు వస్తున్నాయి.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా ఉండేది.
ఇకపోతే ఈ మధ్యకాలంలో మంగ్లీ కాస్త బౌండరీస్ దాటుతూ గ్లామర్ షో( Glamor show ) చేస్తూ రచ్చ చేస్తున్నారు.ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ ఉండే ఈమె ఈ మధ్యకాలంలో గ్లామర్ షో కి తెర తీశారు.ఈ క్రమంలోనే తరచూ గ్లామరస్ ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.తాజాగా ఈమె మరికొన్ని గ్లామరస్ క్యూట్ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.
ఇందులో భాగంగా షర్టుకు ముడి వేసి మరి అందాలు కనిపించేలా ఫోటోలకు ఫోజులిచ్చారు.నారింజ రంగు డ్రెస్ ధరించి షర్ట్ ముడివేసి బోల్డ్ లుక్ లో దర్శనమిచ్చింది.ఇలా మంగ్లీ షేర్ చేసిన ఈ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈ ఫోటోలపై నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.ఒకానొక సమయంలో టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో సింగర్స్ గా కొనసాగుతున్న వారందరూ కూడా మంగ్లీ రాకతో మరుగున పడ్డారు ఈమె ఐటమ్ సాంగ్స్ కి పెట్టింది పేరనీ చెప్పాలి.ఇక మంగ్లీ ఒక పాట కోసం భారీగానే రెమ్యూనరేషన్( Remuneration ) డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది.
ఒక పాట కోసం ఈమె దాదాపు మూడు లక్షల వరకు రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్నారట.ఇక మంగ్లీ చెల్లెలు ఇంద్రావతి చౌహన్( Indrawati Chauhan ) సైతం సింగర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.