ఏపీ అధికార పార్టీలో మంత్రి పదవులు సందడి ఎక్కువగా కనిపిస్తోంది.జగన్ ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు అనేది ఇంకా స్పష్టమైన క్లారిటీ లేకపవడంతో, ఎవరికి వారు మంత్రి పదవులు తమకే దక్కుతాయనే ఆశాభావంతో ఉన్నారు.
ప్రస్తుత ఏపీ మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇద్దరు మరికొద్ది రోజుల్లోనే తమ మంత్రి పదవులకు రాజీనామా చేయబోతున్న నేపథ్యంలో, ఎప్పటి నుంచో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న వాళ్లు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ కు వీర విధేయుడిగా ఉంటూ, కష్టనష్టాల్లో వెంట నడిచిన చాలా మంది సీనియర్ నాయకులకు మొదటి విడత మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కలేదు.
అప్పట్లో సామాజిక సమీకరణాల లెక్కలు చూపించి జగన్ వారిని పక్కకు పెట్టారు.జగన్ మనసు అర్థం చేసుకున్న వారు తర్వాత మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం దక్కుతుందనే అభిప్రాయంతో ఉన్నారు.
ప్రస్తుతం ఖాళీ కాబోతున్న రెండు మంత్రి స్థానాలతో పాటు, మరో ఇద్దరు మంత్రులను తప్పించి, వారి స్థానంలో కొత్తవారిని నియమించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.దీంతో నాలుగు మంత్రి పదవులపై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు.
ప్రస్తుత మంత్రి మోపిదేవి పిల్లి స్థానంలో, అదే బిసి సామాజిక వర్గానికి చెందిన వారిని జగన్ ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది.మిగిలిన రెండు స్థానాల్లో పార్టీ సీనియర్లకు తనకు అత్యంత సన్నిహితులైన వారికి అవకాశం కల్పించబోతున్నారు అనే ప్రచారం పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

మోపిదేవి వెంకటరమణ స్థానంలో శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే డాక్టర్ సి వి అప్పలరాజు పేరు ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చింది.అప్పలరాజు విషయంలో జగన్ మొదటి నుంచి సానుకూల వైఖరితో ఉన్నారు.దీంతో ఆయన మంత్రి పదవికి ఖాయం అని ఇప్పుడు పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.అలాగే సుభాష్ చంద్రబోస్ స్థానంలో, కృష్ణాజిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ పేరు తెరపైకి వచ్చింది.
మిగతా రెండు స్థానాలు ఖాళీ అయితే, వాటిలో అంబటి రాంబాబు ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలాగే బీసీ కోటాలో జంగా కృష్ణమూర్తి, విడుదల రజిని పేర్లు తెరమీదకు వస్తున్నాయి.ఇప్పటికే మంత్రి పదవులు సాధించే ఈ క్రమంలో కొత్త ఇన్చార్జిలుగా నిర్వహించబడును విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వై వి సుబ్బారెడ్డి దగ్గరకు ఆశావహులు అంతా క్యూ కడుతున్నట్టు తెలుస్తోంది.