టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది.నందమూరి హీరోల సినిమాలు సక్సెస్ సాధిస్తే ఆ సినిమాలకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.
బాలయ్య అఖండ సినిమాతో కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.అయితే ఈ రెండు సినిమాలను తెలుగుతో పాటు హిందీలో విడుదల చేసి ఉంటే బాగుండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అఖండ, బింబిసార సినిమాలు రొటీన్ కమర్షియల్ కథాంశాలతో తెరకెక్కిన సినిమాలు కాదు.ఈ రెండు సినిమాలు కథలు ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే.అఖండ సినిమా కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైంది.తొలిరోజు నుంచి సూపర్ పాజిటివ్ టాక్ తో ప్రదర్శితమైన ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లను సాధించింది.
ఈ సినిమా హిందీలో విడుదలై ఉంటే అఖండ మొత్తం కలెక్షన్లు సులువుగా 100 కోట్ల రూపాయలు దాటి ఉండేవి.
మరోవైపు కళ్యాణ్ రామ్ బింబిసార సినిమా గురించి మాట్లాడుతూ బింబిసార సినిమాకు హిట్ టాక్ వస్తే సినిమా రిలీజైన రెండు వారాల తర్వాత హిందీలో రిలీజ్ చేస్తామని చెప్పారు.
అయితే బింబిసార హిందీలో విడుదల కానుందని ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం.బింబిసార హిందీలో విడుదలై ఉంటే తెలుగు రాష్ట్రాలకు ధీటుగా హిందీలో ఈ సినిమాలు కలెక్షన్లను సాధించి ఉండేది.

నందమూరి హీరో తారక్ కు ఇప్పటికే ఆర్ఆర్ఆర్ తో ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు దక్కింది.మిగతా నందమూరి హీరోలు కూడా పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపును సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిసున్నారు.నందమూరి హీరోలైన బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ ఈ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాల్సి ఉంది.







