శ్రీకాళహస్తి గుడి దర్శించుకున్నాకా మరే గుడి దర్శించుకోవద్దు..ఎందుకో తెలుసా?దానివెనుక ఉన్న కారణం ఇదే..

తిరుమ‌ల తిరుప‌తి ద‌ర్శించుకునేందుకు వెళ్లే భ‌క్తులు శ్రీ‌వారి ద‌ర్శ‌నం ముగియ‌గానే చుట్టూ ఉన్నఅన్ని దేవాల‌యాల‌ను ద‌ర్శించుకుంటారు.పాప‌నాశ‌నం.

 Do Not Visit Any Other Temple After Visiting Srikalahasti Temple Do You Know Wh-TeluguStop.com

కానిపాకం.శ్రీ‌కాళ‌హ‌స్తి ఇలా వరుసగా ఒక్కో ఆలయాన్ని ద‌ర్శించుకుంటారు.

అయితే తిరుమల చుట్టూ ఉన్న ఆలయాల్ని సందర్శించేప్పుడు అన్ని గుళ్లను దర్శించుకున్నాక చివరగా శ్రీకాళహస్తిని దర్శించుకోవాలి.అదే చేస్తుంటారు కూడా.

కాని శ్రీకాళహస్తి దర్శనం తర్వాత మరే ఇతర ఆలయాన్ని దర్శించకూడదని,నేరుగా ఇంటికే వెళ్లాలని అంటుంటారు… శ్రీ‌కాళ‌హ‌స్తి ద‌ర్శ‌నం త‌రువాత మ‌రో గుడికి ఎందుకు వెళ్ల‌కూడదు.వెళితే ఏమ‌వుతుంది.

నేరుగా ఇంటికే ఎందుకే వెళ్లాలి.?

గాలి, నింగి, నేల‌, నీరు, నిప్పు ఇవే పంచభూతాలకు ప్రతీకలుగా భూమి మీద పంచ‌భూత లింగాలు వెలిసాయి.అందులో ఒక‌టే చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలిసిన వాయులింగం.అయితే ఇక్క‌డి గాలి స్పరించిన త‌రువాత ఏ ఇతర దేవాల‌యాల‌కు వెళ్ల‌కూడ‌న‌దే ఆచారం.అందులో నిజం లేక‌పోలేదు.స‌ర్ప‌దోషం.

రాహుకేతువుల దోషం ఇక్క‌డికి వ‌చ్చాక పూర్తిగా న‌యమ‌వుతుంది.శ్రీ‌కాళ‌హ‌స్తిలోని సుబ్ర‌మ‌ణ్య స్వామి ద‌ర్శ‌నంతో స‌ర్ప‌దోషం తొలుగుతుంది.

ప్ర‌త్యేక పూజ‌లు చేసుకున్న త‌రువాత నేరుగా ఇంటికే చేరాల‌ని చెపుతారు ఇక్క‌డి పూజారులు.కార‌ణం దోష నివార‌ణ జ‌ర‌గాలంటే శ్రీ‌కాళ‌హ‌స్తిలో పాపాల‌ను వ‌దిలేసి ఇంటికి వెళ్ల‌డ‌మే.

తిరిగి ఏ ఇత‌ర దేవాల‌యాల‌కు వెళ్లిన దోష నివార‌ణ ఉండ‌ద‌నేది అక్క‌డి పూజ‌రులు చెపుతున్నారు.

గ్ర‌హ‌ణాలు.

శ‌ని బాధ‌లు.ప‌ర‌మ‌శివుడుకి ఉండ‌వ‌ని.

మిగితా అంద‌రి దేవుళ్ల‌కి శ‌ని ప్ర‌భావం.గ్ర‌హ‌ణ ప్ర‌భావం ఉంటుంద‌ని చెపుతున్నారు.దీనికి మ‌రోక ఆధారం.చంద్ర‌గ్ర‌హణం.ఈ రోజున కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా అన్ని దేవాల‌యాలు మూసివేస్తారు.గ్రహణానంతరం సంప్రోక్షణ జరిపి అప్పుడు పూజ‌లు ప్రారంభిస్తారు.

కానీ గ్ర‌హ‌ణ స‌మ‌యంలో శ్రీకాళహస్తి దేవాలయం మాత్రం తెరిచే ఉంటుంది.అంతే కాదు రోజంతా ప్రత్యేక పూజలు జ‌రుగుతూనే ఉంటాయి.

అందుకే ఇక్క‌డ ద‌ర్శ‌నం చేసుకున్నాక ఇక దైవం ద‌ర్శ‌నం అవ‌స‌రం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube