ఎవరికి రాని ఐడియాలు మన భారతీయులకే వస్తాయి.మరీ ముఖ్యంగా ఉన్నంతలో సౌకర్యంగా బతకడం ఎలాగో మనవారికి తెలిసినట్టు మరెవ్వరికీ తెలియదు.
ఇక సోషల్ మీడియా( Social media ) అందుబాటులోకి వచ్చిన తరువాత ఇటువంటి ఆలోచనలు చేసినవారు వెలుగు చూస్తున్నారు అని చెప్పుకోవచ్చు.అవును, మనలో కొందరికి భలే ఐడియాలు వస్తుంటాయి.
మండే ఎండల్లో ఆటో ఎక్కే ప్రయాణికుల కోసం ఓ ఆటో డ్రైవర్( Auto driver )కి వచ్చిన ఐడియా చూశారంటే మీరు విస్తు పోతారు.అలాంటి ఐడియా నాకేం రాలేదు అంటారు.
అవును, మనం చేసే ఆలోచనలే ఎదుటివారిని ఆకర్షిస్తాయి.సాధారణంగా కార్లలో, బస్సుల్లో ఏసీ ఓకే గానీ… ఆటోలో ఏసీ ప్లాన్ చేయాలనే ఆలోచన ఎవరికి వస్తుంది? కానీ అతగాడికి వచ్చింది.దాంతో అతగాడు ఇపుడు సోషల్ మీడియాలో హీరో అయ్యాడు.ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోని చూసిన నెటిజన్లు అతగాడి ఆలోచనకు ఫిదా ఐఓప్తున్నారు.ఎండల్లో అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే సొంత వెహికల్.లేదంటే బస్సు, ఆటో పట్టుకోవాల్సిందే.
ప్రస్తుతం కాలంలో ఎండలు దారుణంగా ఉండడంతో ప్రయాణం అనేది చాలా చికాకుగా సాగుతుంది.కానీ అతని ఆటోను ఎక్కడానికి కస్టమర్లు క్యూలు కడుతుంటారు మరి.
కారణం అతని ఆలోచన.తన ఆటోలో చల్లదనం ఉంటే గిరాకీ బాగుంటుందని ఆలోచించాడేమో కానీ ఆ ఆటో డ్రైవర్.తన ఆటోకి కూలర్( Cooler auto _ని ఫిక్స్ చేసేసాడు.దాంతో అందులో ప్రయాణించేవారు చల్ల చల్లగా.కూల్ కూల్‌గా ప్రయాణం చేసేస్తున్నారు.దాంతో ఈ వేసవిలో కూడా మనోడి బండికి భలే గిరాకీ.
చేసే పనిలో క్రియేటివ్‌గా ఆలోచించడం, దానిని మనకు లాభసాటిగా మార్చుకోవడం అంటే ఇదే.కబీర్ సెటియా అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోని షేర్ చేస్తూ… ‘ఇంజనీర్ బహుశా ఆటో డ్రైవర్ అయ్యాడేమో’ అని.క్యాప్షన్ పెట్టాడు.కాగా అతని ఆలోచన నేడు అనేకమందిని ఇంప్రెస్ చేస్తోంది.